twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సేవ్ చేసాడు..అంతా చూసారు(లీకెడ్ ఫొటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవన్ కల్యాణ్ దేముడుగా కనిపిస్తూ హీరోయిజం చేయటానికి సిద్దపడ్డ సంగతి తెలిసిందే. గోపాలుడు అంటే వెన్న దొంగతనాలు, చిలిపి చేష్టలే కాదు. గోవర్ధన గిరినే చిటికెన వేలుపై ఎత్తేసిన లీలలూ గుర్తొస్తాయి. అలాంటి గోపాలుడు తన భక్తురాలి భర్తను కాపాడకుండా ఉంటాడా? అందుకే నేరుగా భూలోకానికి వచ్చేశాడు. ఈ వైనమేంటో 'గోపాల గోపాల'లో చూడొచ్చు. ఈ చిత్రానికి సంభందించిన ఇంటర్వెల్ బ్లాక్ ని రీసెంట్ గా అర్దరాత్రిపూట చిత్రీకరించారు. వివరాల్లోకి వెళితే...

    'Gopala Gopala': Pawan & Venky's Hulchal at Midnight

    రీసెంట్ గా వెంకటేష్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలను హైదరాబాద్ లోని మాదాపూర్ ప్లై ఓవర్ పై చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ ..స్పాంకీ బైక్ వేసుకుని, ట్రెండి కాస్టూమ్స్ తో వెంకటేష్ ని గూండాలని రక్షించారు. వెంకటేష్ ని చంపబోయే వారి నుంచి ఫైట్ చేసి మరీ రక్షించారు. ఈ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ గురించి ముందే వార్త బయిటకు రావటంతో ఆ ప్రాంతం అంతటా పవన్ అభిమానులతో నిండిపోయింది. అక్కడ తమ సెల్ ఫోన్స్ లో ఫొటోలు తీసి చాలా మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పెట్టడం జరిగింది.

    అంతకు రెండు రోజులు ముందు..ప్రధాన పాత్రధారులైన వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రియలపై సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించారు. భక్తుడిని శ్రీకృష్ణుడు ఎలా కాపాడుతాడనేవే ఆ సన్నివేశాలు. ఎయిర్‌పోర్టు రోడ్డులో అలెన్‌ అమీన్‌ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్‌బాబు, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    English summary
    A crucial sequence of 'Gopala Gopala' was shot midnight near Madhapur flyover. Its a chase sequence that comes at interval block where Pawan Kalyan saves Venkatesh from goons who try to kill him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X