twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ వీక్: ‘గోపాల గోపాల’ 30 కోట్ల మార్క్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘గోపాల గోపాల' చిత్రం త శనివారం విడుదలై పండగ సీజన్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి వారం పూర్తి చేసుకుని రూ. 30 కోట్లకు చేరువైనట్లు ట్రేడ్ వర్గాల టాక్.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద కూడా దుమ్ము రేపుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయని టాక్.

    https://www.facebook.com/TeluguFilmibeat

    మరో వైపు ఈ చిత్రం చుట్టూ పలు వివాదాలు కూడా కమ్ముకున్నాయి. ఈ సినిమాలో మతానికి సంబందించిన కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని పలువురు ఇప్పటికే ఈ చిత్రంపై కేసు వేసారు. అలాగే ఇప్పుడు కొంత మంది న్యాయవాదులు ఈ సినిమాని ఆపేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా ఓ లాయర్ ‘గోపాల గోపాల' సినిమా ప్రదర్శన ఆపేయాలని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ఈ సినిమాలో లాయర్స్ మనోభావాలను దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేసారు.

    ‘Gopala Gopala’ set to cross the 30 cr mark

    ఇంతకు ముందు ‘గోపాల గోపాల' సినిమాలో హిందు స్వామిజీలు, పీఠాధిపతులపై తీసిన సన్నివేశాలు హిందువులను మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ రఘునాథరావు అనే వ్యక్తి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివాదాలతో పాటు పైరసీ కూడా జోరుగా సాగుతోంది. ‘సంక్రాంతి' పండగ సందర్భంగా సొంతూర్లకు వెలుతున్న వారిని ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వారు ‘గోపాల గోపాల' పైరసీ సీడీలను బస్సుల్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఈ బాగోతం బయట పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది. బస్సులో ఉన్న పవర్‌స్టార్‌ అభిమాని ఈ బండారం బయట పెట్టినట్లు సమాచారం. వెంటనే యాంటీ పైరసీ టీమ్స్ రంగంలోకి దిగాయి.

    మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

    English summary
    According to the latest update, ‘Gopala Gopala’ is all set to cross the 30 crores mark after the first week of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X