» 

దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా తండ్రయ్యాడు

Posted by:

హైదరాబాద్: 'దూసుకెళ్తా' మూవీ దర్శకుడు వీరూ పోట్ల బేబీ గర్ల్‌కు తండ్రైన విషయం ఈ రోజు మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో శుభవార్త కూడా అందింది. 'బలుపు' చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా తండ్రి అయ్యాడు. గోపీచంద్ దంపతులు మగ బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు గోపీచంద్ మలినేని వెల్లడించారు. గోపీచంద్ మలినేని వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీసత్యతో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వీరి వివాహం జరిగింది. సరిగ్గా 9 నెలలు తిరిగేలోపే గోపీచంద్ తండ్రవడం గమనార్హం. మరి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గోపీచంద్ మలినేనికి వన్ ఇండియా తెలుగు తరుపున శుభాకాంక్షలు తెలుపుదాం.

శ్రీహరి నటించిన 'పోలీస్' చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గోపీచంద్ మలినేని, ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ గా చేసారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అందరివాడు, వెంకీ, ఢీ, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రానికి, శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం చిత్రానికి, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి, బిల్లా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.

రవితేజ హీరోగా 'డాన్ శీను' చిత్రంతో హీరోగా పరిచయం అయిన గోపీచంద్, ఆవెంటనే వెంకటేష్‌తో 'బాడీగార్డ్' సినిమా చేసే అవకాశం దక్కించుకుని తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన 'బలుపు' చిత్రంతో మరో హిట్టు కొట్టాడు. త్వరలో గోపీచంద్ మలినేని దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

Read more about: gopichand malineni, shruti hassan, balupu, anjali, ravi teja, రవితేజ, గోపీచంద్ మలినేని, శృతి హాసన్, బలుపు, అంజలి
English summary
After Veeru Potla, is now the turn of another director to be blessed with a baby. Gopichand Malineni, who directed the super hit ‘Balupu’, has been blessed with a baby boy.
Please Wait while comments are loading...