twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ ''సౌఖ్యం'' ఫస్ట్ లుక్ పోస్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్: గోపీచంద్ హీరోగా, రెజీనా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ''సౌఖ్యం'' . భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఎ.ఎస్‌.ర‌వికుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు మినహా టాకీ పూర్తయ్యింది. ఈ సందర్బంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు నిర్మాతలు. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

    సౌఖ్యంగా ఉన్నారా? అంటున్నారు గోపీచంద్. నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా, నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. గోపీచంద్ కెరీర్ ఆరంభంలో 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

    Gopichand's Soukyam First Look

    ఈ సందర్భంగా వి.ఆనంద్‌ ప్రసాద్ మాట్లాడుతూ - ''ఎదుటివారి సౌఖ్యం గురించి ఆలోచించేవాళ్లే ఆత్మీయులు. త‌న ఇంట్లో ఉండే వాళ్లు మాత్రమే కాదు, త‌న చుట్టుప‌క్క‌ల‌వాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాల‌నుకునే మంచి మనసున్న వ్యక్తి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆత్మీయుల సౌఖ్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడతాడు. ఫైట్స్ మాత్రమే కాదు... ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేయ‌డానికైనా సిద్ధపడిపోతాడు. ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి, గోపీచంద్ కాంబినేష‌న్‌ లో రూపొందుతున్న చిత్రం కావడంవల్ల అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య ఉంటే అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌కు పెద్ద పీట వేసిన సినిమా ఇది. అనూప్ రూబెన్స్ మంచి స్వరాలందించారు. యూత్ కీ, కుటుంబ ప్రేక్షకులకూ ఈ పాటలు దగ్గరవుతాయి. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.

    ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ - ''ఎదుటివారి క్షేమ‌స‌మాచారాల‌ను క‌నుక్కోవ‌డం మ‌న‌కున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు త‌న వారి సౌఖ్యం కోసం, త‌న చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్షన్ నే చేశాడా? ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే కొన‌సాగాడా? అనేది ఈ సినిమాలో ప్రధానాంశం. గోపీచంద్‌, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప‌దేళ్ళ త‌ర్వాత గోపీచంద్‌తో మ‌ర‌లా ప‌నిచేస్తుంటే ఒక‌ర‌క‌మైన ఉత్సాహంగా ఉంది'' అని చెప్పారు.

    గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ‌్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

    English summary
    Gopichand and Regina Cassandra starring Soukyam movie first look poster released today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X