twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్‌ 'సౌఖ్యం' కొత్త టీజర్‌ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: భవ్య క్రియేషన్స్‌ పతాకంపై గోపీచంద్‌, రెజీనా జంటగా నటించిన చిత్రం సౌఖ్యం . విడుదల కు దగ్గర పడుతున్న ఈ చిత్రం సరికొత్త టీజర్‌ విడుదలైంది. హీరో గోపీచంద్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

    #SoukyamOnDec24th #5DaysToGo

    5 more days to hit the screens #Soukyam#SoukyamOnDec24th #5DaysToGo

    Posted by Gopichand on 18 December 2015

    ఏఎస్‌ రవికుమార్‌చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఈ నెల 24న సౌఖ్యం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    వి.ఆనంద్‌ ప్రసాద్ మాట్లాడుతూ - ''ఎదుటివారి సౌఖ్యం గురించి ఆలోచించేవాళ్లే ఆత్మీయులు. త‌న ఇంట్లో ఉండే వాళ్లు మాత్రమే కాదు, త‌న చుట్టుప‌క్క‌ల‌వాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాల‌నుకునే మంచి మనసున్న వ్యక్తి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆత్మీయుల సౌఖ్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడతాడు. ఫైట్స్ మాత్రమే కాదు... ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేయ‌డానికైనా సిద్ధపడిపోతాడు. ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి, గోపీచంద్ కాంబినేష‌న్‌ లో రూపొందుతున్న చిత్రం కావడంవల్ల అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య ఉంటే అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌కు పెద్ద పీట వేసిన సినిమా ఇది. అనూప్ రూబెన్స్ మంచి స్వరాలందించారు. యూత్ కీ, కుటుంబ ప్రేక్షకులకూ ఈ పాటలు దగ్గరవుతాయి. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.

    Gopichand's Soukyam movie new teaser

    ద‌ర్శకుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ - ''ఎదుటివారి క్షేమ‌స‌మాచారాల‌ను క‌నుక్కోవ‌డం మ‌న‌కున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు త‌న వారి సౌఖ్యం కోసం, త‌న చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్షన్ నే చేశాడా? ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే కొన‌సాగాడా? అనేది ఈ సినిమాలో ప్రధానాంశం. గోపీచంద్‌, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప‌దేళ్ళ త‌ర్వాత గోపీచంద్‌తో మ‌ర‌లా ప‌నిచేస్తుంటే ఒక‌ర‌క‌మైన ఉత్సాహంగా ఉంది'' అని చెప్పారు.

    గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

    English summary
    Gopichand's new movie Soukyam new teaser released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X