twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యరాయ్ థ్రిల్, కాన్స్ ఫిల్మ్‌ఫెస్ట్‌లో మోడీపై కామెంట్స్

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తన స్టన్నింగ్ లుక్‌తో చూపరుల మతిపోగొడుతోంది. ఈ నీలి కళ్ల సుందరి ఈ కాన్స్ ఫెస్టివల్‌లో ప్రస్తుత పొలిటికల్ హీరో నరేంద్ర మోడీపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.

    కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేవలం అందాలు ప్రదర్శించడమే కాదు...భారత దేశానికి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడిపై ప్రశంసల వర్షం కురిపించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని, భారత దేశం స్థితి మారుతుందని భావిస్తున్నట్లు ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.

    Gorgeous Aishwarya Hails Modi's Victory At Cannes!

    'మా దేశానికి నెక్ట్స్ ప్రైమ్ మినిస్టర్‌గా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టబోతుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మోడీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధి విషయంలో గతంలో కంటే మరింత వేగవంతంగా ముందుకు సాగుతుందనే నమ్మకం ఉంది' అంటూ ఐశ్వర్యరాయ్ తన మనసులోని మాట బయట పెట్టారు.

    ఐశ్వర్యరాయ్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ప్రీతీ జింతా, సోహా అలీ ఖాన్, వివేక్ ఒబెరాయ్ తదితరులు మోడీ విజయం సాధించడంపై ఓపెన్‌గా స్పందించారు. మోడీ దేశానికి ప్రధాని అవుతుండటం శుభ సూచకమని పేర్కొన్నారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ఏకంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌లో ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    English summary
    While Aishwarya Rai Bachchan stunned everyone with her super gorgeous looks at the Cannes 2014 Film Festival, the blue eyed beauty also came up with some praising words for the current hero in politics, Narendra Modi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X