twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోవిందుడు అందరివాడేలే' కొత్త టీజర్(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. వచ్చే నెల 15న పాటల్ని విడుదల చేస్తారు. అక్టోబరు 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా చిత్రం కొత్త టీజర్ ని విడుదల చేసారు. ఆడియో తేది ని ఖరారు చేస్తూ ఈ టీజర్ విడుదల చేయటం జరిగింది. ఆ టీజర్ మీరూ చూడండి.

    నిర్మాత గణేశ్‌ తెలియజేస్తూ ‘‘ కృష్ణవంశీ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్‌శంకర్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్సవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. రామ్‌చరణ్‌ లుక్స్‌ను అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. సెప్టెంబర్‌ 15న పాటలనూ, అక్టోబర్‌ 1న చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

    ఇక ఈ చిత్రం కాన్సెప్టు ఏంటంటే... పల్లెటూరంటే... పచ్చదనం, తెలుగుదనం. మనవైన ఆప్యాయతలు, అనురాగాలూ అక్కడే కనిపిస్తాయ్‌. పిన్ని, పెద్దమ్మ.. బాబాయ్‌, నానమ్మ, తాతయ్య - ఎన్ని పిలుపులో. ఇంకెన్ని ఆప్యాయతలో. ఈ అరమరికలు లేని ఆనందాన్ని అనుభవించాలని విదేశాలనుంచి వచ్చాడో కుర్రాడు. కానీ... ఇక్కడి అనుబంధాలూ కలుషితమైపోయాయని అర్థమయ్యింది. మరి ఇలాంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దాడో, తాను కలలుకన్న ఉమ్మడి కుటుంబాన్ని తానే ఎలా నిర్మించుకొన్నాడో తెలియాలంటే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చూడాల్సిందే.

    Govindudu Andarivadele Latest Teaser

    దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. '' అని చెప్పుతున్నారు.

    శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ. కూర్పు: నవీన్‌ నూలి.

    English summary
    The teaser of Ram Charna's Govindudu Andari Vadele is finally out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X