twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరు ముఖ్యమంత్రులకు ధాంక్స్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసి సక్సెస్ అయ్యింది ‘రుద్రమదేవి' టీమ్ . నవంబర్ 29 వ తేదీకి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు గుణశేఖర్...తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన చేసారు.

    అలాగే ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే ఈ విజయం తెలుగు ప్రజలకు చెందుతుందని అన్నారు.
    ఈ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అదరొకొట్టాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Gunasekhar thanks to CBN & KCR

    భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిందీ ఈ చిత్రం. ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించి మెప్పించారు.

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించింది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంది'' అన్నారు.

    సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.

    English summary
    'Rudramadevi', India's first historical 3D stereoscopic flick, successfully completed 50 days runs on November 29th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X