» 

'డార్లింగ్' మ్యూజిక్ డైరక్టర్ కి డార్లింగ్ దొరికింది

Posted by:
Give your rating:

ప్రభాస్ చిత్రం డార్లింగ్ కి సంగీతం అందించిన జివి ప్రకాష్ త్వరలో గాయని సైంధవిని వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి మధ్యా చాలా కాలంగా స్నేహం,ప్రేమ ఉన్నాయని, అవే పరిణయానికి దారితీసాయని ప్రకాష్ చెప్తున్నారు. తెలుగులో సైంధవి మామిడి కొమ్మకి...(ఆవకాయ బిర్యాని),ఎలగెలగ(పరుగు) చిత్రాలుకు పాడింది. ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ గాయనిగా గతంలో సత్కరించింది కూడా. ఇక జివి ప్రకాష్ విషయానికి వస్తే అతి చిన్న వయస్సులోనే (ఇప్పుడు కేవలం 23) సంగీత దర్శకుడు అయ్యారు. రజనీకాంత్ చిత్రం కథానాయకుడుకి కూడా ఇతనే సంగితం అందించటం విశేషం. అలాగే కరుణాకరన్..ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి ఈ యువ సంగీత దర్శకుడే పనిచేసాడు. ఇక తమ వివాహం గురించి మాట్లాడుతూ...అవును..మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం. సైంధవి నాకు స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితురాలు. అలాగే గత ఎనిమిదేళ్ళగా ఇద్దరం ఒకరికొకరు బాగా తెలుసున్నవాళ్ళం. ఈ మధ్యనే మా ఇద్దరు తల్లి తండ్రులు కలిసి మాట్లాడుకుని వివాహం నిశ్చయించారు. వచ్చే సంవత్సరం చివరిలో వివాహం జరుగుతుంది అన్నారు. ఈ జంటకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

Read more about: డార్లింగ్, జివి ప్రకాష్, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరుణాకరన్, ఆవకాయ బిర్యాని, పరుగు, darling, gv prakash, karunakaran, aavakai biryani, parugu
Please Wait while comments are loading...