twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేకెట్ చేతిలో పట్టుకుని హన్సిక (ఫొటోలు)

    By Srikanya
    |

    చెన్నై : అందాల ముద్దుగుమ్మ హన్సిక టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుని.. ప్రస్తుతం కోలీవుడ్‌లో హవా చాటుతోంది. 'ఓకే ఓకే' చిత్రంతో తమిళ పరిశ్రమలో క్రేజీ మరింత పెరిగింది. కుష్బూ మాదిరిగానే అభిమానులు కూడా గుడి కట్టేందుకు సిద్ధమయ్యారు. దాంతో అక్కడ ఆమెకు కొన్ని కంపెనీల వాళ్లు తమ ఉత్పత్తులకు ప్రచారంగా ఆమెను ఎంపిక చేసుకుంటున్నారు.

    తాజాగా ఆమెతో సూపర్ డిటెర్డెంట్ పౌడర్ ని లాంచ్ చేయించారు. చెన్నై..అన్నా సాలై లోని పార్క్ హోటల్ లో ఈ లాంచింగ్ జరిగింది. ఈ లాంచింగ్ ని మీడియా మొత్తం భారిగా కవరేజ్ చేయటంతో ఆ సబ్బు కంపెనీ వారి ఖర్చుకు ఫలితం లభించినట్లైంది.

    ఆ ఫొటోలు మీ కోసం... స్లైడ్ షోలో...

    ఫోజ్ ఇస్తూ..

    ఫోజ్ ఇస్తూ..

    లాంచింగ్ సమయంలో ఇలా కెమెరాకు ఫోజ్ ఇస్తూ కనపడింది హన్సిక. అందరి దృష్టినీ ఆకర్షించింది.

    ట్రేడ్ మార్క్

    ట్రేడ్ మార్క్

    హన్సిక ట్రేడ్ మార్క్ నవ్వు ఇప్పుడు తమిళనాట ప్రసిద్ది. దాంతో ఇలా తమిళ తంబీలను ఐస్ చేసేస్తోంది.

    టీమ్ తో..

    టీమ్ తో..

    ఆ సబ్బుకి సంభందించ సూపర్ టీమ్ తో ఇలా వారి ముచ్చటను తీరుస్తూ ఫొటో దిగింది.

    బొకే

    బొకే

    ముందుగా ఆమెకు ఫ్లవర్ బొకే ఇచ్చి ఇదిగో ఇలా స్వాగతించారు.

    మొత్తానికి

    మొత్తానికి

    చివరకి వారి ముచ్చట ఇలా పౌడర్ ని పట్టుకుని చూపిస్తూ తీర్చేసింది. ఇంతకీ ఈ పౌడర్ కి మార్కెట్ బాగా పెరుగుతుందా చూడాలి.

    హన్సిక సినిమాల, పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే... శింబుతో రెండు సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. అందులో ఒకటి 'వాలు' కాగా, మరొకటి 'వేట్టె'మన్నన్‌. 'వాలు' చిత్రీకరణ సమయంలోనే శింబు, హన్సికల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

    ఆగస్టు తొమ్మిదో తేదీన హన్సిక పుట్టినరోజు కావడంతో.. అంతకు కొన్నిరోజుల ముందు నుంచే శింబు ఉత్సాహంగా ఎగిరి గంతేశారు. 'హన్సిక పుట్టినరోజు వస్తోంది. ఏం గిఫ్టు ఇవ్వాలో తెలియట్లేదు. సజెషన్‌ ఇవ్వండ'ని ట్విట్టర్‌లో తన అభిమానులను అడిగారాయన. ఆ మరునాడు తన ప్రియురాలి(?)తో జరుపుకున్న పుట్టినరోజు ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సరిగ్గా.. ఏడాది తిరిగేసరికి కథ అడ్డం తిరిగింది.

    ఈ మధ్య కాలంలో నయనతార మళ్లీ శింబుతో కలిసి 'ఇదు నమ్మ ఆళు'లో నటించేసరికి.. హన్సిక ఏకాకి అయినట్లు సమాచారం. తాజాగా తన పుట్టినరోజును అమ్మ మోనా మొత్వానితో జరుపుకున్నారు. మరి వీరి ప్రేమ వ్యవహారం ముగిసినట్టేనా.. అని కోడంబాక్కం జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

    English summary
    Bubbly girl Hansika Motwani was spotted in Chennai. The actress, like usual, was not in the city to attend a film event rather to launch a product. Sublime Consumers' Super detergent powder. The event was organised at the Park Hotel, Anna Salai, Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X