twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి హన్సిక వంతు...భయపెడుతోంది (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : హన్సిక ప్రధాన పాత్ర పోషించిన డబ్బింగ్ చిత్రం ‘చంద్రకళ' ఈ నెల 19న విడుదలవుతుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అరన్మణి' సినిమాను ‘చంద్రకళ' పేరుతో తెలుగులోకి అనువదిస్తోంది శ్రీ శుభశ్వేత ఫిల్మ్స్‌ సంస్థ. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. మీరూ చూడండి..

    ఈ చిత్రం గురించి నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘తమిళంలో ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. హారర్‌ టచ్‌తో థ్రిల్లింగ్‌గా ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ ఆడియన్స్‌కి కొత్త అనుభూతి కలిగిస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మా బేనరులో ‘చందమామ' చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అంతకుమించి ‘చంద్రకళ' విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.

    హన్సిక ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం‘అరన్మణి' తెలుగులో ‘చంద్రకళ' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అనువాదపు హక్కుల కోసం చాలామంది పోటీ పడినప్పటికీ భారీ ఆఫర్‌ ఇచ్చి నిర్మాత సి.కల్యాణ్‌ సొంతం చేసుకున్నారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిల్మ్స్‌ పతాకంపై అందిస్తున్నారు.

    Hansika's Chandrakala teaser launched

    కల్యాణ్‌ మాట్లాడుతూ ‘తమిళనాడులో ఇప్పటికే రూ. 24 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించిన ‘అరన్మణి' తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకంతో ఫ్యాన్సీ ప్రైజ్‌ చెల్లించి రైట్స్‌ తీసుకున్నాను. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉంటూ హారర్‌ టచ్‌తో చాలా థ్రిల్లింగ్‌గా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారైన సినిమా. డిసెంబర్‌ నెల మూడో వారంలో సినిమాను రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ‘చందమామ' తర్వాత మా బేనరులో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది' అని తెలిపారు.

    హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్‌, ఫొటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, సహనిర్మాత: పద్మారావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్‌ సి.

    English summary
    Hansika, Lakshmi Rai, Andrea's hit tamil film ‘Aranmai’ directed buy Sundar.C is releasing in Telugu as ‘Chandrakala’. The film celebrated its teaser launch yesterday at Prasad Labs. C.Kalyan is presenting the film produced by Swethayalana, Varuna, Teja and CV.Rao on Sri Subha Swetha Films banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X