Don't Miss!
- Finance Radakishan Damani: దమానీ భారీ బెట్.. ఆ కంపెనీలో 2.33 లక్షల షేర్లు కొనుగోలు.. స్టాక్ దూకుడు
- News జగన్ పై దాడి కేసులో పురోగతి-పోలీసుల అదుపులో 10 మంది-అప్ డేట్ ఇదే..!
- Technology iPhone SE 4 భారీ డిస్ప్లే, మెరుగైన బ్యాటరీలతో ఐఫోన్ SE 4 స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Banana Milkshake వేసవి తాపానికి బనానా మిల్క్ షేక్ బాడీ కూల్ చేస్తుంది..ఆరోగ్యకరమైనది కూడా..
- Sports రాయల్ ఛాలెంజర్స్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
- Automobiles ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
అందుకే పవన్‌కళ్యాణ్ తో కత్తి పట్టించాను
హైదరాబాద్: నేను పనిచేసే హీరోలేం చేస్తుంటారో అది చేస్తూ ప్లస్ నేను వాళ్లని కొత్తగా ఎలా చూపించగలనో అనేది ఆలోచిస్తాను. గబ్బర్‌సింగ్‌లో పవన్‌కళ్యాణ్ పాత స్టయిల్, మేనరిజమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఆయన అప్పట్లో చేసిన సినిమాల్లో లవ్ కాన్‌ఫ్లిక్ట్ ఉండేది. తొలిప్రేమ, బద్రి, ఖుషీ ఇలా ఏ సినిమాలో చూసినా లవ్ కాన్‌ఫ్లిక్ట్‌తో సినిమాలు చేసేవారు. ఎపడూ రోడ్డు మీద నిలబడి విలన్‌తో నువ్వా నేనా అని ఛాలెంజ్‌లు చేయలేదు
అలాగే పవన్ ఎప్పుడూ ....విలన్స్ గుండెల మీద కాలు పెట్టి వార్నింగులు ఇవ్వలేదు. కత్తి పట్టుకుని నరకలేదు. దబంగ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ ఎక్కడా కత్తి పట్టుకోడు. నేను గబ్బర్‌సింగ్‌లో పవన్‌కళ్యాణ్‌గారితో కత్తి పట్టించాను. ఆయనకున్న ఇమేజ్‌కి, ఆయన ఫాలోయింగ్‌కి ఇలా చేస్తే ఇంకా అదిరిపోతుందని ఫీలయ్యాను. అలా చేయించాను.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఈయనెపడూ అన్ని సినిమాల్లోను కత్తి పట్టుకునే తిరుగుతుంటాడు . ఈయన సినిమాల్లో లవ్ కాన్‌ఫ్లిక్ట్సు, ఈగో క్లాష్‌ల లాంటివి ఉండవు. ఆయన రెగ్యులర్‌గా చేసేవి చేస్తూనే ఇవి కూడా చేస్తే కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాం అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. రామయ్య వస్తావయ్యా ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్. నిర్మాత 'దిల్'రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో విషయం ఏంటంటే... ప్రేక్షకుల ఊహకందని ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో ఉందని సమాచారం. దాన్ని దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచారని వినికిడి. ఇటీ సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.