Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
దేవిశ్రీ ప్రసాద్‌ను ఎందుకు తప్పించారు?
హైదరాబాద్: సూర్య నటించిన సింగం, సింగం-2 చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు దేవిశ్రీ ప్రసాద్. త్వరలో సింగం-3 కూడా రాబోతోంది. తొలుత ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ పేరు ప్రకటించారు. ఏమైందో తెలియదు కానీ మళ్లీ సంగీతం దేవిశ్రీకే బాధ్యత అప్పగించారు.
మరోసారి ‘సింగం-3' సినిమాకు సంగీత దర్శకుడిని మార్చారు. దేవిశ్రీని తప్పించి తాజాగా ఆ బాధ్యతలు హారిస్ జైరాజ్ కు అప్పగించడం చర్చనీయాంశం అయింది. ఈ మేరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే దేవిశ్రీ కావాలనే తప్పుకున్నాడా? లేక మరేదైనా కారణంతో సింగం-3 దర్శకుడు హరి దేవిశ్రీని తప్పించాడా? అనేది తెలియాల్సి ఉంది.
హారిస్ జైరాజ్ గతంలో సూర్య నటించిన కాకా కాకా, గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, సెవెన్త్ సెన్స్, బ్రదర్స్ వంటి సినిమాలకు సంగీతం అందించారు.
సింగం-3 సినిమా వివరాల్లోకి వెళితే... తొలి రెండు చిత్రాల్లో సందడి చేసిన అనుష్క సింగం-3లోనూ నటిస్తోంది. సింగం-2లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన హన్సిక స్థానానంలో శృతిహాసన్ నటిస్తోంది. డిసెంబర్-2 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. వైజాగ్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది.