twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గౌతమిపుత్ర శాతకర్ణి' : రాజమాత గౌతమి బాలాశ్రీ ఫస్ట్ లుక్ ఇదిగో

    By Srikanya
    |

    హైదరాబాద్ :'విశ్రాంతి లేదు. విరామం లేదు.. నా కత్తి కంటిన నెత్తుటి ఛాన ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?' అంటూ ఆవేశంగా చెబుతూ గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ. క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం టీజర్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    దసరా కానుకగా విడుదల చేసిన ఈ టీజర్‌లో బాలకృష్ణ రాజకుమారుడి పాత్రలో రాజసం ఉట్టిపడుతూ పౌరుషంగా కనిపించారు.శుత్రువులతో సై అంటే సై అంటూ సమరంలో పోరాడుతున్నారు. బాలయ్య అభిమానుల మనసును దోచుకునేలా ఉన్న ఈ టీజర్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

    ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీగా హేమమాలిని నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ రోజు హేమమాలిని పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ...''రాజమాతగా హేమమాలిని ఒదిగిపోయారు. ఆమె పాత్ర, అభినయం బాగుంటుంది. ఇప్పటివరకు గౌతమిపుత్ర శాతకర్ణిగా నందమూరి బాలకృష్ణ, వశిష్టిదేవిగా నటిస్తున్న శ్రియ ప్రచార చిత్రాల్ని విడుదల చేశాం. మంచి స్పందన లభించింది''అని తెలిపారు.

    <strong>మామూలుగా లేదుగా: బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫస్ట్ పోస్టర్ (ఫొటోలు)</strong>మామూలుగా లేదుగా: బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫస్ట్ పోస్టర్ (ఫొటోలు)

    అలాగే ..''దసరాకు విడుదల చేసిన టీజర్, అందులో 'మా కత్తికంటిన నెత్తుటిచార ఇంకా పచ్చిగానే ఉంది.
    సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా?' అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లకు మంచి స్పందన లభిస్తోంది'' అన్నారు.

    తల్లిని ప్రేమించే వాడు దేశాన్నీ ప్రేమించగలడు అని నిరూపించిన రారాజు... గౌతమి పుత్ర శాతకర్ణి. యుద్ధరంగంలో శత్రువుపై కత్తి దూసే ముందు ఎంత కర్కోటకంగా ఉంటాడో, బంధాల్నీ, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేప్పుడు అంత సున్నిత మనస్కుడిలా ఆలోచిస్తాడు కూడా. అతని కథేమిటో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో చూసి తెలుసుకోవాల్సిందే అని దర్శకుడు చెప్తున్నారు.

    ఇటీవలే మధ్యప్రదేశ్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. హైదరాబాద్‌లోనూ కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. త్వరలో చిత్రబృందం మరోసారి జార్జియా వెళ్లబోతోంది. ''చక్రవర్తిగా బాలయ్య రాజసం, ఆయన పలికే సంభాషణలూ చూసి, విని తీరాల్సిందే. ఆయన కెరీర్‌లో ఇది మర్చిపోలేని చిత్రం అవుతుంద''ని చిత్ర యూనిట్ తెలిపింది.

    కొన్ని పాత్రలు కొందరు నటుల కోసమే పుడతాయి. జానపద, పౌరాణికాల్లో ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌లాంటి మహా నటులను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదు. నేటితరంలో అలాంటి పాత్రలు చేయగలిగిన అతికొద్ది మంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.

    కథ, పాత్ర నచ్చితే ఎలాంటి ప్రయోగం చేయడానికైనా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా కనపడుతున్నారు.

    సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు: బుర్రా సాయిమాధవ్, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్‌భట్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.

    English summary
    Veteran actress Hema Malini is playing the key role as mother of Balakrishna in Krish's 'Gauthamiputra Satakarni'. Hema Malini celebrates her birthday on 16th October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X