»   » రవితేజ ‘బెంగాల్ టైగర్’ (ఫస్ట్ లుక్)

రవితేజ ‘బెంగాల్ టైగర్’ (ఫస్ట్ లుక్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల త‌రువాత మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘బెంగాల్ టైగ‌ర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన‌ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ ‘మా బ్యాన‌ర్ లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ హీరోగా తెరకెక్కిస్తున్న బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త‌మ‌న్నా, రాశిఖ‌న్నా పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. సంప‌త్ నంది అనుకున్న దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. హీరో ర‌వితేజ‌, బ్ర‌హ్మ‌నందం గారి కాంబినేష‌న్ వ‌చ్చే ప్ర‌తి సన్నివేశం ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. గెస్ట్ పాత్ర‌ల్లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రానే, అక్ష న‌టిస్తున్నారు. బోమ‌న్ ఇరానితో పాటు రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కిస్తున్నస్తున్నాం' అని అన్నారు.


Here it is first look poster of Bengal Tiger Movie !

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ ‘బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ అనుకున్న విధంగా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాం. మాస్ మహారాజ రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పెర్ ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అవుతోంది. రవితేజ ఫ్యాన్స్ తో పాటు... అన్ని వర్గాల ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని బెంగాల్ టైగర్ ని తయారు చేస్తున్నాం' అని అన్నారు.


ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఈ షెడ్యూల్ లో న‌టించారు. బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సుంద‌ర్ రాజ‌్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

English summary
Here it is first look poster of Bengal Tiger Movie !
Please Wait while comments are loading...