twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కాక ముందు నాని ఇలా... ( మరో ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : డైరక్షన్ డిపార్టమెంట్ నుంచి వచ్చి ఎదిగి హీరో అయిన నానికి తన గతం తలుచుకోవటం చాలా ఇంట్రస్ట్. ఆయన బాపు గారి వద్ద రాధాగోపాలం(శ్రీకాంత్,స్నేహ) చిత్రానికి క్లాప్ బోయ్ గా చేసారు. తర్వాత కాలంలో హీరో అయ్యారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ తన వద్ద నున్న ఫొటోని ఇదిగో ఇలా షేర్ చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఎటువంటి సినీ నేపధ్యం లేని కుటుంబంలో పుట్టిన నాని, మణిరత్నం ‘దళపతి' సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసి, ఆ సినిమా రగిల్చిన స్పూర్తితో బాపు దగ్గర ‘రాధాగోపాలం', శ్రీను వైట్ల దగ్గర ‘డీ' చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.

    మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చమ్మా' సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమై, తన నటనతో, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నాడు. ‘పిల్ల జమిందార్', ‘ఈగ', ‘ఎటో వెళ్ళిపోయింది మనసు' లాంటి వైవిధ్య కధాంశాలు ఎన్నిక చేసుకుని నేటి తరం మేటి హీరోల జాబితాకు చేరువవుతున్నాడు.

    ప్రస్తుతం నాని...

    Hero Nani's Flashback Photo

    నాని ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగు దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. నాని హీరోగా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. విలక్షణ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే విడుదలైంది.

    నాని మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం 35మంది హిమాలయాలకు వెళ్లి కష్టపడ్డాం. ఆ సమయంలో బతకడానికి ఏమీ అక్కర్లేదు, ఆలుగడ్డలుంటే చాలనుకునే పరిస్థితి మాది. మా కృషికి తగ్గ ఫలితాన్ని విజయం రూపంలో ప్రేక్షకులు అందిస్తారని ఆశ'' అన్నారు.

    ''నా కథని నమ్మారు నిర్మాతలు. అందుకే ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేశాం'' అన్నారు చిత్ర దర్శకుడు. ''అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఈ కథను ఎంచుకొన్నాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అన్నారు నిర్మాత.

    నాని ట్వీట్ చేస్తూ......‘వినూత్న కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 36 మంది యూనిట్ సభ్యులు ఎవరెస్ట్ బేస్ క్యాంపులో సముద్రమట్టానికి 5300 మీటర్ల ఎత్తులో చిత్రీకరణ జరిపారు. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. అయితే అక్కడ చలికి తట్టుకోలేక 10 మంది మధ్యలో వెనుతిరిగగా, చివరి వరకూ 26 మంది ఉన్నారు. సగం పర్వత శ్రేణులలో, సగం నగరంలో ఈ సినిమా చిత్రీకరణ చేశాం. ' అన్నారు.

    చిత్రం హీరోయిన్ రితి వర్మ మాట్లాడుతూ.... నా ఫేవరెట్ హీరోలలో నాని ఒకరు. ఆయన సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో నాని హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమాలో నేను బాగా డబ్బులున్న అమ్మాయిగా నటిస్తున్నాను. తండ్రి అంటే చాలా ఇష్టం. అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపిస్తాను. అని రితు వర్మ చెప్పింది.

    తన జీవితం గురించి తెలుసుకోవడానికి ఓ కుర్రాడు మొదలు పెట్టె జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు సమాహారమే కథాంశం. రితు వర్మ, మలయాళ భామ మాళవిక నాయర్ నాని సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేశ్,.నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు.

    మరోప్రక్క అమలా పాల్ తో నాని కలిసి చేసిన 'జెండా పై కపి రాజు' చిత్రం రిలీజ్ కోసం నాని ఎదురుచూస్తున్నారు .నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం.

    బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు. నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి.

    శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు. అమలాపాల్‌ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

    English summary
    Nani once again shared a blast from the past pic of his from his working days as assistant director under legendary director Bapu garu for Radha Gopalam movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X