twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడు మహేష్ బాబు థీరీనే ఫాలో అవుతున్నా

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నా కెరీర్‌ గురించి మహేష్‌ ఆరా తీస్తుంటారు. 'ఇలాంటి కథలు ఎంచుకో, అలాంటి దర్శకులతో పనిచెయ్యి' అని చెబుతుంటారు.ఆ సలహాలు ఉపయోగపడుతున్నాయి. 'తొలినాళ్లలో ఇలాంటివి కావాలని చెప్పి దర్శకులతో కథలు రాయించుకొనేవాణ్ని. అయినా విజయం లభించలేదు. ఆ తర్వాత వాళ్లు తెచ్చిన కథల్లోనే బాగున్నవాటిని ఎంపిక చేసుకొన్నా. అప్పుడే విజయాలొచ్చాయి' అంటుంటారు మహేష్‌. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నా'' అంటున్నారు సుధీర్ బాబు. మహేష్ బాబు చెల్లెలు భర్త సుధీర్ బాబు. మహేష్ సలహా,సంప్రదింపులతో తన కెరీర్ ముందుకెళ్తోందని ఎప్పుడూ చెప్తూంటాడు సుధీర్.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కృష్ణ అల్లుడిగా, మహేష్ బావ గా.. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 'ప్రేమకథా చిత్రమ్‌'తో విజయాన్ని అందుకొన్న ఆయన త్వరలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోమవారం సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అలాగే...బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితకథతో సినిమా చేయాలనేది నా కల. దీనికోసం ఓ అగ్ర నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పారు.

    Hero Sudheer Babu following Mahesh's ideas

    ఇక ...''సినిమా కోసం నేను నేర్చుకొన్న కళల్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం నాకింకా రాలేదు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'మోసగాళ్లకు మోసగాడు', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాలు నటుడిగా నన్ను మరో కోణంలో ఆవిష్కరిస్తాయి. నాలోని నటుడిపై ఇంకా ఎవరికైనా సందేహాలుంటే ఈ చిత్రాలు తీర్చేస్తాయని నమ్ముతున్నా. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఓ కొత్త రకమైన సాంకేతికతతో తెరకెక్కుతోంది'' అన్నారు.

    సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మించారు. హరి స్వరాలు సమకూర్చారు.

    మహష్‌బాబు ఇప్పటి వరకు 'జల్సా', 'బాద్‌షా' చిత్రాల్లో తన గొంతునే వినిపించారు. తొలిసారి ఓ చిత్రంలో అతిధిగా అలరించనున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు.

    Hero Sudheer Babu following Mahesh's ideas

    ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్‌ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    నిర్మాత ల‌గ‌డ‌పాటి శిరీష శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ.... ఇప్పటి వ‌ర‌కు ఎన్నో ప్రేమ క‌థా చిత్రాలు వ‌చ్చాయి అయితే వాటి అన్నింటికి భిన్నంగా మేము ఓ సినిమాను రూపొందించాల‌ని త‌ల‌పెట్టాము.. దాని ఫ‌లిత‌మే ఈ కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరినీ సినిమా .. ఈ సినిమాను పోల్చ వ‌ల‌సి వ‌స్తే గ‌తంలో తెలుగు లో వ‌చ్చిన మ‌రో చ‌రిత్ర హిందీలో వ‌చ్చిన ప్రేమ పావురాలు సినిమా స్థాయిలో ఉంటుంది. ఈ చిత్ర ద‌ర్శకుడు చంద్రు క‌న్నడంలో ఎంతో పేరు ఉన్న ద‌ర్శకుడు.. అత‌డు అక్కడ వ‌ర‌స విజ‌యాల‌ను అందించాడు.

    ఈ చిత్రం సంగీతం గురించి చెప్ప వ‌ల‌సి వ‌స్తే ఆదిత్యా మ్యూజిక్ వారు మామూలు రేటు కంటే ప‌దంత‌లు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంగీతాన్ని వారు చేస్తేనే బాగుంటుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శకుడు హ‌రి ఎ.ఆర్‌. రెహ‌మాన్ అంత‌టి స్థాయిలో సంగీతాన్ని అందించాడు అని వారు కొనియాడారు. ఈ సినిమా సంగీతం ప‌రంగా సినిమా ప‌రంగా ప్రేక్షకులను అల‌రిస్తుంద‌నే నమ్మకం మాకు ఉంది. మా బేన‌ర్ స్థాపించి ప‌దేండ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా మంచి విజ‌యాన్ని సంపాదించి పెడుతుంద‌ని ఆశిస్తున్నాము అన్నారు.

    Hero Sudheer Babu following Mahesh's ideas

    సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన ‘చార్మినార్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఈ చిత్రాన్ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి చిత్రాన్ని నిర్మించాలనుకున్నానని, ప్రేమకథాచిత్రమ్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో చక్కని ప్రేమకథ ఉందని, తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.

    దర్శకుడు కథ చెప్పిన తీరు నచ్చడంతో తానీ చిత్రాన్ని ఒప్పుకున్నానని, సినిమా ప్రతీ ప్రేక్షకుడికి నచ్చుతుందని, ప్రతిఒక్కరూ ఈ సినిమా చూసి తమ పాత రోజులు గుర్తుచేసుకుంటారని హీరో సుధీర్‌బాబు తెలిపారు.

    కన్నడంలో పెద్ద చిత్రాలమధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందని, కథకు తగిన విధంగా పేరును కూడా నిర్ణయించామని దర్శకుడు చంద్రు అన్నారు.

    గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, సారికా రామచంద్రరావు, చిట్టిబాబు, అభిజిత్, కిషోర్‌దాస్, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్న చిత్రానికి మాటలు: ఖధీర్‌బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా:కె.ఎస్.చంద్రశేఖర్, సంగీతం: హరి, నిర్మాత: శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.చంద్రు.

    English summary
    Hero Sudheer Babu said that he is following his brother in law Mahesh's Ideas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X