»   » హీరోయిన్ ప్రణీతకు యాక్సిడెంట్, గాయాలు (ఫొటోలు)

హీరోయిన్ ప్రణీతకు యాక్సిడెంట్, గాయాలు (ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అత్తారింటికి దారేది చిత్రంతో స్టార్ హీరోయిన్ స్దాయికి ఎదిగిన హీరోయిన్ ప్రణీతకు ఈ రోజు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె వెళ్తున్న కారు బోల్తాపడింది. అయితే అదృష్టవశాత్తు..స్వప్ప గాయాలతో బయిటపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట తరలించారు. అనంతరం ప్రణీత మరో వాహనంలో హైదరాబాద్‌ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తూండగా నల్గొండ జిల్లా మోతె వద్ద ఈ యాక్సిడెంట్ అయ్యింది. పెద్ద ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయిన చిన్న గాయాలు త్వరలోనే తగ్గిపోతాయని ఆమె అంటోంది. ఈ విషయమై ఆమె వెంటనే ట్వీట్ చేసి అబిమానులు కంగారుపడకుండా ఉంచే ప్రయత్నం చేసింది.

నల్గొండ జిల్లా సూర్యాపేట-ఖమ్మం రహదారిపై మోతె సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఆమె తల్లి మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఖమ్మంలో ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద స్ధలం వద్ద ఫొటోలు...

షాక్

ఈ ప్రమాదం పెద్ది కాదు కానీ షాక్ నుంచి బయిటకు రాలేకపోతున్నా అంటోంది ప్రణీత

ఊహించలేదు

ఈ ప్రమాదం హటాత్తుగా కొద్ది క్షణాల్లో జరిగిపోయింది

 

మూగారు

యాక్సిడెంట్ అదీ సెలబ్రెటీకు జరిగిందని తెలియటంతో అందరూ మూగారు.

 

రహదారి పనులు..

ప్రమాదం జరిగిన ప్రాంతంలో రహదారి పనులు జరుగుతున్నాయి. అక్కడి ఏఈఈలు తక్షణం స్పందించి అంబులెన్స్‌ను పిలిపించి, సహాయ చర్యలు చేపట్టారని ప్రణీత వారికి ధన్యవాదాలు తెలిపారు.

సీటుబెల్ట్ వల్లే...

కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రణీత సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు.

 

రీసెంట్ గా

ఈమె రీసెంట్ గా తెలుగు వారియర్స్ ని సపోర్ట్ చేసింది.

 

దేశద్రోహి అంటూ

కన్నడవారిని కాకుండా ప్రణీత తెలుగువారియర్స్ టీమ్ వారిని సపోర్ట్ చేయటం నచ్చక ఆమెను దేశద్రోహి అని తిట్టిపోసారు.

 

ప్రస్తుతం

ప్రణీత ప్రస్తుతం..బ్రహ్మోత్సవం చిత్రం చేస్తోంది.

 

ఫైనల్ గా

తాను ప్రమాదం నుంచి తప్పించుకుని బౌన్సర్స్ మినీ బస్సులో వెళ్తున్నానని చెప్పుకొచ్చింది

 

English summary
Pranitha Subhash ‏ tweeted:"While on our way back from khammam. perfectly fine but unable to come out of the shock "
Please Wait while comments are loading...