twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి-2’ టికెట్ రేట్ల పెంపుకు హైకోర్టు అనుమతి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి-2' మూవీ టికెట్స్ రేట్లను పెంచి విక్రయించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. టికెట్ల రేట్ల పెంపుపై థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

    వారం రోజుల పాటు బాహుబలి-2 టికెట్ రేట్లను పెంచి అమ్ముకోవడానికి కోర్టు అనుమతి లభించిందని, ఇప్పటి నుండి సాధారణ థియేటర్లలో ఇంతకు ముందు రూ. 50 ఉన్న టికెట్ ను రూ. 80కి అమ్మబోతున్నారని, అయితే మల్టీ ప్లెక్స్ లలో పాత రేట్లే కొనసాగనున్నాయని తెలుస్తోంది.

    High Court allows cinema halls to hike ticket rates

    కోర్టు నిర్ణయంతో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు కాసుల పంట పండబోతోంది. ఈ నిర్ణయం వల్ల సాధారణ సగటు ప్రేక్షకుడికి సినిమా టికెట్ మరింత భారం కానుంది. తొలి వారం రోజుల తర్వాత సాధారణ రేట్లకు టికెట్లు అమ్మనున్నాయి.

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-2 మూవీ ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం ఇలా దేశ వ్యాప్తంగా ఈచిత్రం భారీగా దాదాపు 9 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి 2 సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫిల్మీబీట్.

    English summary
    Cinemas in Telangana and Andhra Pradesh have got the go-ahead from Hyderabad High Court to hike ticket charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X