Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బ్రూస్ లీ: చిరు, చరణ్ మధ్య హార్స్ రైడింగ్ సీన్ (ఫోటో)
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ' సినిమా అభిమానులకు మెగా కనువిందుగా ఉండబోతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి 3 నిమిషాల పాటు గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చిరంజీవిపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.
సెట్స్ లో చిరంజీవికి సంబంధించిన ఫోటోలు కూడ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో చిరు, చరణ్ మధ్య హార్స్ రైడింగ్ సీన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటో బయటకు లీకైంది. చిరంజీవి గెస్ట్ రోల్ సినిమాకే హైలట్ అవుతుందని అంటున్నారు.
ఇక అక్టోబర్ 2న 'బ్రూస్‌లీ' గీతాలను విడుదల చేయనున్నారు. అలాగే ఈ ఆడియో వెన్యూ కూడా ఫైనలైజ్ అయ్యింది. హైదరాబాద్ ..హైటెక్స్ గ్రౌండ్ లో ఘనంగా జరగనుంది. టాప్ టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ ఫంక్షన్ కు హాజరవనున్నారని సమాచారం.
రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.