twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్ తో హాట్ గా కాజల్ (సెల్ఫీ ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : గోవా షూటింగ్ లో ఉన్న కాజల్ రోజుకో ఫొటో అన్నట్లు దిగి షేర్ చేసేస్తోంది. తాజాగా తన దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఇదిగో ఇలా ఓ ఫొటో దిగింది. పూరి దీన్ని స్వయంగా సెల్పీ గా క్లిక్ చేసారు. బ్రేక్ టైమ్ లో ఈ ఫొటో దిగామని చెప్తున్నారు. ఈ ఫొటోని బట్టి ఆమె ఈ చిత్రంలో చాలా హాట్ ఉండబోతోందని తెలుస్తోంది.

    చిత్రం విషయానికి వస్తే...

    ఈ చిత్రం ఎన్టీఆర్ చెడుగుడు ఆడేస్తాడని చెప్తున్నారు. అతని పాత్ర గురించి చెప్తూ...అతని స్పీడు చూసి రాకెట్‌ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ జోరుకి కెరటం సలామ్‌ కొడుతుంది. దూకుడు కాస్త నెమ్మదించి.. అతనికి దారిస్తుంది. పంజా విసిరితే పులే..! అతని లక్ష్య సాధనకు అడ్డొస్తే..చెడుగుడు ఆడేస్తాడు. అంత పంచ్‌ పవర్‌ ఉన్న పోలీస్‌ను చూడాలంటే ఎన్టీఆర్‌ సినిమా వచ్చే వరకూ ఆగాలి.

    Hot Kajal with Jagan at Goa

    ఎన్టీఆర్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. మధురిమ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. గోవాలో చిత్రీకరణ సాగుతోంది. పాటలు, కీలక సన్నివేశాలు, పోరాట దృశ్యాలూ.. అక్కడ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలన్న లక్ష్యంతో చిత్రబృందం శ్రమిస్తోంది.

    ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నారు. 'టెంపర్‌', 'షంషేర్‌' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే తాజాగా టెంపర్ టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. ఈ రోజే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Director Puri Jagannath clicked a selfie with his heroine Kajal during the shooting break and it is doing rounds in internet now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X