twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ ఇష్యూ : కేసీఆర్ ఒప్పుకోక పోవచ్చు అంటున్నారు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలోనే ‘బాహుబలి' చిత్రం ఒక బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది. తెలుగు సినిమా మార్కెట్‌కు మించి ఈ చిత్రానికి బడ్జెట్ ఖర్చు చేసారు. అయితే ఎలాగైనా పెట్టుబడి రాబట్టుకోవడంతో పాటు భారీ లాభాలు గడించడానికి బాహుబలి టీం తనదైన స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా స్ట్రాటజీని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడానికి ప్రయత్నిస్తోంది.

    ఇందులో భాగంగా సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. అంతే కుండా ఇంగ్లీషుతో పాటు మరికొన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. దాదాపు 3600 థియేటర్లలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సినిమా టికెట్స్ రేటు పెంచాలనే ఆలోచనలో ఉన్నారట.

    ఈ మేరకు బాహుబలి టీం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ తెలంగాణ సినిమాటోగ్రపీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ లను కలిసినట్లు సమాచారం. వారి ద్వారా తమ ప్రపోజల్‌ను కేసీఆర్‌‌కు ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తోంది.

     Hot topic: Baahubali ticket prices proposal

    అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాలు, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....కేసీఆర్ అంత ఈజీగా ఈ ప్రపోజల్‌కు అంగీకరించక పోవచ్చని చెబుతున్నారు. సినిమా పరిశ్రమకు తన సహకారం అన్ని విధాలుగా ఉంటుందని, పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉండటానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కేసీఆర్ గతంలో చెప్పినప్పటికీ....దాని అర్థం ప్రేక్షకులపై టిక్కెట్ల రేటు రూపంలో భారం పెంచడం మాత్రం కాదని అంటున్నారు.

    గత కొంత కాలంగా సాగుతున్న....ఈ టిక్కెట్ల రేటు పెంపు వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో సాధారణ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టిక్కెట్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, మరింత పెంచితే ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లడం కష్టమని సాధారణ ప్రేక్షకుడు అంటున్నారు. టిక్కెట్ల రేటు పెంచితే ప్రేక్షకులు పైరసీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

    English summary
    Rajamouli and Shobhu are to meet Minister Talasani Srinivas Yadav and KTR to forward the hike the ticket prices proposal on to CM KCR table. Having heard this news from movie circles, some of the confidential members of TRS have reported us that KCR is not that easy to crack to accept the plan of 'Baahubali' team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X