twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీజే మీద ముదురుతున్న మరో వివాదం: చెప్పులతో గాయత్రీ మంత్రమా..?

    24 ముద్రలతో 24 వైబ్రేషన్స్‌తో ఉంటుంది గాయత్రి మంత్రం. అలాంటి మంత్రాన్ని డీజే లో హీరోతో చెప్పులేసుకుని మంత్రింపజేయించారు.

    |

    గాయత్రీ మంత్రం హిందూ మతం లో ఉండే ప్రతీ వ్యక్తీ పరమ పవిత్రంగా భావించే ఈ మంత్రాన్ని పఠించటానికి కూడా సమయాన్నీ, స్థలాన్నీ పరిగణ లోకి తీసుకుంటారు. చెప్పులు వేసుకొనీ, శరీరం అపరిశుభ్రంగా ఉన్నప్పుడూ ఈ మంత్రాన్ని పఠించటం దోషంగా భావిస్తారు. పదిహేనేళ్ళ కిందట అమితాబ్ షూ వేసుకొని ఈ మంత్రాన్ని పఠించిన సన్నివేశం దేశవ్యాప్త విమర్శలకు కారణం అయ్యింది. శివసేన చేసిన ఆందోళనతో ఆ సన్ని వేశాన్ని తర్వాత ఎడిట్ చేసారు కూడా. అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే మంత్రం మళ్ళీ తెలుగు సినిమాలో అవమానించబడిందంటున్నాయి బ్రాహ్మణ సంఘాలు.

    గాయత్రి మంత్రం

    గాయత్రి మంత్రం

    ఇప్పటికే ఒక పాటలో శివ మంత్రాక్షరాలైన నమక, చమకాలను వాడి అవమానించారనీ, వాటిని తొలగించినా అంతకన్నా దారునం అయిన అవమాణం ఈ గాయత్రీ మంత్రానికి జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ‘‘24 ముద్రలతో 24 వైబ్రేషన్స్‌తో ఉంటుంది గాయత్రి మంత్రం. అలాంటి మంత్రాన్ని హీరోతో చెప్పులేసుకుని మంత్రింపజేయించారు.

    నేను బ్రాహ్మణుడిని

    నేను బ్రాహ్మణుడిని

    అదే చాలా పెద్ద తప్పు. మితిమీరిన తత్వం అంటే అదే. స్వయం ప్రకటిత మేధావినని డైరెక్టర్ అనుకుంటున్నాడు. నేను బ్రాహ్మణుడిని.. నాలోనే బ్రాహ్మణత్వం ఉంది. నేనేం చెప్పినా చూస్తారని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఆయనేం చెప్పినా ప్రేక్షకులు చూస్తారనేది మితిమీరిన తెలివితేటలు.

    చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించరు

    చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించరు

    ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం అదే. ఎవ్వరూ కూడా చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించరు. అది జగమెరిగిన సత్యం. మరి, దర్శకుడు చెప్పినప్పుడు హీరో తెలిసే చేసుంటాడు కదా. బ్రాహ్మణులు ఎలా ఉంటారనే దానిపై మూడునెలలో..ఆరు నెలలో శిక్షణ తీసుకున్నానని హీరో చెప్పాడు కదా. అధ్యయనం చేసే చిత్రంలో నటించానని చెప్పాడు.

    బ్రాహ్మణ పండితులతో శిక్షణ

    బ్రాహ్మణ పండితులతో శిక్షణ

    మరి, అధ్యయనం చేసి నటించినప్పుడు ఈ విషయం తెలియాలి కదా. చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించకూడదన్న విషయం తెలిసుండాలి కదా.ఆయన కూడా తెలిసి చేసిన తప్పే కదా. తెలియక చేసిన తప్పు అనడం ఒట్టి మాట. అధ్యయనం చేశాను.. బ్రాహ్మణ పండితులతో శిక్షణ పొందాను అని ఆయనే అన్నారు.

     సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు ఇస్తాం

    సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు ఇస్తాం

    ముందుగా దీనిపై మేం సెన్సార్ బోర్డు వాళ్లకు ఫిర్యాదు ఇస్తాం. అసలు చెప్పులేసుకుని గాయత్రి మంత్రం జపించకూడదన్న విషయం సెన్సార్ బోర్డు వాళ్లకు మాత్రం తెలియదా..? దానిని సెన్సార్ వాళ్లు ఎలా ఒప్పుకొన్నారు? అంటే వాళ్లు కూడా చూసీ..చూడనట్టు వదిలేసినట్టే కదా. వారితో లాలూచీ పడినట్టే కదా'' అన్నది వారి మాట.

    English summary
    new controversy around Duvvada jagannadham "How can Allu Arjun chant Gayatri Mantra wearing Chappals?" asks bhrahmin Comyunitys
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X