twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్షణ ముసుగులోనే పైరసీ దందా... బాహుబలి–2 పైరసీ ముఠా అసలు రంగు

    బాహుబలి 2 పైరసీ ముఠా వెనక ఉన్న విషయాన్ని చూసి పోలీసులే కాదు... మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీనే ముక్కున వేలేసుకుంది.

    |

    పైరసీ... ఇండియన్ సినిమా మాత్రమే కాదు ప్రపంచం లోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో పాతుకు పోయిన ఒక దుర్మార్గం. కొన్ని వందలమందిశ్రమనీ, కొన్ని కొట్ల రూపాయల పెట్టుబడినీ అక్రమ మార్గం లోకి మళ్ళించి దాంతో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నిర్వాకం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. అయితే మన దగ్గర మాత్రం మరీ బరితెగించారు. యాంటీ పైరసీ అంటూనే తామే ఈ చీకటి దందాని కొనసాగించారు. అసలు ఇంత గా వీళ్లు ఎలా తమ వ్యాపారాన్ని కొనసాగించ గలిగారూ అంటే...

    తమిళ్ రాకర్స్

    తమిళ్ రాకర్స్

    తమిళ్ రాకర్స్ లాంటి సైట్ ఏకంగా ఒక సినిమా విడుదల కాకముందే ఆ సినిమాని రిలీజ్ సమయం కంటే ముందే మేం అందుబాటులోకి తెస్తాం అంటూ ప్రకటించే స్థాయికి చేరుకుందీ అంటే ఈ ప్రమాదం ఎంత స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ సంచలం బాహుబలి విషయం లో కూడా ఒక సంస్థ పైరసీ చేయటమే కాకుండా ఒక కొత్త వ్యూహానికి తెర లేపింది.

    నిర్మాత కరణ్ జోహార్ తో

    నిర్మాత కరణ్ జోహార్ తో

    ఏకంగా ఆ సినిమా హిందీ వెర్షన్ నిర్మాత కరణ్ జోహార్ తోనే ఆ సినిమా పైరసీ కాపీ బయట పెట్టకుండా ఉండటానికి బేరానికి దిగింది.. అయితే కరణ్ కొంత తెలివిగా వ్యవహరించటం తో ఆ ముఠా గుట్టు వీడింది. అయితే తర్వాత ఆ ముఠా వెనక ఉన్న విషయాన్ని చూసి పోలీసులే కాదు... మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీనే ముక్కున వేలేసుకుంది. ఎందుకంటే ఈ సంస్థ పైరసీకి యాంటీగా పనిచేస్తున్నది కావటమే...

    పైరసీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ పైరసీ వింగ్‌

    పైరసీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ పైరసీ వింగ్‌

    ఢిల్లీకి చెందిన రాహుల్‌ మెహతా ప్రీతంపురలో కార్యాలయం ఏర్పాటు చేసి.. జితేందర్‌కుమార్‌ మెహతా, తౌఫీఖ్, మహ్మద్‌ అలీతో పాటు మరికొందరిని ఉద్యోగులుగా తీసుకున్నాడు. తమది సినిమా పైరసీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ పైరసీ వింగ్‌ అని ప్రచారం చేసుకు న్నాడు.

    యాంటీ పైరసీ వింగ్‌ ముసుగులోనే

    యాంటీ పైరసీ వింగ్‌ ముసుగులోనే

    బాలీవుడ్ లో ఉండే ఫిలిం మేకింగ్ సంస్థలన్నిటి తోనూ మంచి సంబందాలు ఏర్పరచుకున్నాడు. దీని ముసుగులోనే కొత్త చిత్రాల పైరసీని ప్రోత్సహించడం ప్రారంభించాడు. యాంటీ పైరసీ వింగ్‌పేరుతో పని చేయటం వల్ల ఏ సినిమా ప్రొడక్షన్ కంపెనీ కూడా వీళ్లని అనుమానించలేదు. ఈ నేపథ్యం లోనే బాహుబలి-2 పైరసీ సీడీ చేతికి వచ్చిన వెంటనే రాహుల్‌ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌నే సంప్రదించగలిగాడు.

    వర్కింగ్ స్టైల్

    వర్కింగ్ స్టైల్

    వీళ్ళ వర్కింగ్ స్టైల్ కూడా ప్రత్యేక పద్దతిలో సాగింది. పైరసీ సినిమాల విక్రయం, ఆ సీడీలు చూపిం చి నిర్మాతల్ని బెదిరించి డబ్బు గుంజడంతో దిట్టగా పేరున్న రాహుల్‌ మెహతా ఏ సంద ర్భంలోనూ నేరుగా పైరసీ చేయడట. తన అను చరులతో చేయించడమో, పైరసీ సీడీలను చేజిక్కించుకుని తర్వాత ఆ సినిమా నిర్మాతలను మారు పేరుతో బెదిరించటమో చేసేవాడు..

    యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్

    యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్

    అయితే ఈ పైరసీ ప్రింట్ ని హైదరాబాద్ నుంచే చేజిక్కించుకోవటం గమనార్హం. శాటిలైట్ ద్వారా సినిమాను ప్రదర్శించే సంస్థల్లో యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్ ఒకటి. ఈ సంస్థలో గతంలో పని చేసిన మోను అలియాస్ అంకిత్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ థియేటర్లో ఉండే శాటిలైట్ సర్వర్ లో సినిమా కాపీ చేసే విధానం కనిపెట్టేసాడు. దీని ఆధారంగా సినిమాను పైరసీ చేసాడు. ఇతని దగ్గరినుంచే రాహుల్ ముథా ఈ ప్రింట్ ని చేజిక్కించుకుంది.

    బాహుబలి 1 చిత్రాన్ని సైతం

    బాహుబలి 1 చిత్రాన్ని సైతం

    2015లో బాహుబలి 1 చిత్రాన్ని సైతం ఈ ముఠా పైరసీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ కేంద్రంగా తన అనుచరులతో ఈ పని చేయించి.. నెట్‌లో పెట్టి సొమ్ము చేసుకు న్నాడు. అయితే బాహుబలి-2 పైరసీ ఎలా చేశారనే విషయాన్ని రాహుల్‌ పట్టించుకోలేదు. సీడీ తన చేతికి రాగానే బేరసారాలకు దిగాడు. అయితే కరణ్ జోహార్ అంతకన్నా తెలివిగా పోలీసులతో కలిసి ఆ గ్యాంగ్ ని పట్టించేసాడు.

    కాపీరైట్ చట్టంకింద మాత్రమే

    కాపీరైట్ చట్టంకింద మాత్రమే

    అయితే ఇప్పటి వరకూ పైరసీ దారులమీద పటిష్టమైన కేసులేవీ లేవు కేవలం కాపీరైట్ చట్టంకింద మాత్రమే వారి మీద కేసు నమోదు చేస్తారు. అయితే ఈసారి మాత్రం డిస్ట్రిబ్యూటర్‌ను మోసం చేయడం, అంతా కలసి కుట్రపన్నడం, నిర్మాతలను బెదిరించడం.. అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆయా సెక్షన్లనూ జోడించి కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఇప్పైవరకూ 30 బాలీవుడ్ సినిమాలను పైరసీ చేయటమే కాకుండా, పలువురు నిర్మాతలను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు కూడా సమాచారం...

    English summary
    The cyber crimes cell of the Hyderabad Police seized equipment and material from the six accused, who allegedly downloaded a high-definition version of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X