twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ తో వెళ్లినప్పుడే 'కంచె' కథ పుట్టింది : క్రిష్

    By Srikanya
    |

    హైదరాబాద్: ''వేదం' చిత్రీకరణ సమయంలో నేనూ, అల్లు అర్జున్‌ విశాఖపట్నం వెళ్లాం. అక్కడ నేవీ మ్యూజియంలో ఓ బాంబు చూశాం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1942 ఏప్రిల్‌ 6న విశాఖపట్నంలోని రెండువేల టన్నుల మందుగుండు సామాగ్రితో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకొని జపాన్‌ వాళ్లు ఆ బాంబును సంధించారు. అయితే.. అదృష్టవశాత్తూ అది పేలలేదు. లేదంటే చరిత్ర మర్చిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన సంఘటన జరిగేది. అంతకుముందు రెండో ప్రపంచయుద్ధం అంటే మనకు సంబంధం లేని వ్యవహారం అనుకునేవాణ్ని.

    ఆ బాంబు చూశాక నాలో కొత్త ఆలోచన రేకెత్తింది. 'వేదం'ను తమిళంలో 'వానం' పేరుతో తెరకెక్కిస్తున్నప్పుడు లొకేషన్లకోసం కారైకూడి వెళ్లాం. అక్కడ ఓ చెట్టియార్‌ ఇల్లు కనిపించింది. అందులో సైనికులకు సంబంధించిన చిత్రపటాలు, వాళ్లకొచ్చిన మెడల్స్‌, విక్టోరియా రాణి పంపిన ధ్రువపత్రాలూ ఉన్నాయి. వాటిని చూశాక మరింత ఆసక్తి కలిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశపు ప్రాతినిధ్యం ఎంత అనే విషయం స్పష్టంగా అర్థమైంది. దాదాపు పాతిక లక్షలమంది భారతీయులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు.

    దాదాపు 24వేల మంది మరణించారు. 65 వేలమంది క్షతగాత్రులయ్యారు. 11 వేల సైనికుల ఆచూకీ లభించలేదు. ఈ అంకెలు నన్ను విస్మయపరిచాయి. ఈ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమ కథ చెప్పాలనిపించింది. ఆ ప్రయత్నం 'కంచె'లో చేశాం. మనుషులంటే పంచుకొని బతకాలి, కంచెలేసుకొని కాదు... అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం'' అన్నారు క్రిష్‌

    How Varun Teja's Kanche story started

    చిత్రం విశేషాలకు వస్తే...

    'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియోని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

    ఇంతకు ముందు నిర్మాతలు ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 17న వైజాగ్ లో విడుదల చేయనున్నట్లు అఫిషియల్ ప్రకటన చేసారు. అయితే అందుతున్న సమచారం ప్రకారం మెగా మార్పు చోటు చేసుకుంది. ఈ ఆడియో పంక్షన్ ని హైదరాబాద్ కే షిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పంక్షన్ కు రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు అవుతారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే ఇప్పటివరకూ లేదు. త్వరలో వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.

    ఇప్పటికే రిలైజన ట్రైలర్ అందరి మన్ననలూ పొందుతోంది. ఆ ట్రైలర్ ఇదిగో...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది . అలాగే...స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని ...కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తేదీ మరేదో కాదు....అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది.

    ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.

    How Varun Teja's Kanche story started

    ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.

    ‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

    రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది.

    అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్న చిత్రం లోఫర్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. లోఫర్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

    English summary
    Director Krish said about how his latest kanche movie started. Kanche audio launch has been shifted back to Hyderabad and it will take place on 17th September, with Ram Charan as the chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X