twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ అవార్డ్ వల్ల నాకు సంతృప్తి లేదు... కే.విశ్వనాథ్

    'దర్శకుడిగా సంతృప్తికరమైన ప్రయాణం సాగిందని నేను అనుకోవడం లేదు. నాకే కాదు.. ఏ కళాకారుడికీ సంతృప్తి ఉండదు. అన్నారు కళాతపస్వి కే. విశ్వనాథ్

    |

    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ భారతీయ సినీరంగం లో నోబెల్ లాంటిది. ఈ దేశం లోనే అత్యుత్తమ సేవలందించిన కళాకారుడికి దక్కే ఈ పురస్కారం అందుకోవటం అంటే మాటలు కాదు. కొన్ని సంవత్సరాల కృషీ, కళ మీద ఉండే తపనా అన్నీ కలిసి దాదాపుగా జీవనసాఫల్య పురస్కారం లాంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్ద్. ఈ సారి మన టాలీవు దిగ్గజాన్ని వరించిందా అవార్ద్. నిజంగానే కళని తపస్సుగా భావించిన కళాతపస్వి కే విశ్వనాథ్.

    'దర్శకుడిగా సంతృప్తికరమైన ప్రయాణం సాగిందని నేను అనుకోవడం లేదు. నాకే కాదు.. ఏ కళాకారుడికీ సంతృప్తి ఉండదు. శంకరాభరణం తీశా కదా అని ఇక చాలు అనుకోలేం కదా. కళ.. సంగీతం.. సాహిత్యం.. వీటన్నిటి గురించి ఎంత చెబితే మాత్రం సరిపోతుంది. అయితే.. సినిమా కళతో మంచి చెప్పాలని కొందరు అంటారు.

    I am not happy with award said k.viswanath

    అది వ్యాపారం అంటారు మరికొందరు.. వినోదం అంటారు మరికొందరు. ఎవరి ఆలోచన వారిది. నేను కళా సేవ చేసేశానని అనుకోను. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడం కాదు కదా. అయితే.. విలువలకు దూరంగా ఒక సినిమా కూడా తీయలేదు' అన్నారు కళా తపస్వి.

    'ఇప్పటి తరానికి సలహాలు నేనేమీ ఇవ్వను. వారేమన్నా అమాయకులా? అందరూ ప్రతిభ కలవారే. అందుకే వారిపై కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. ఇప్పటి దర్శకులపై ఎంతో ఒత్తిడి ఉంటోంది. ద్రౌపదికి ఐదుగురు భర్తలయితే.. ఈ కాలం డైరెక్టర్లకు 50 మంది ఉంటున్నారు. అందరి సంతృప్తి పరస్తూ సినిమా తీయడం చిన్న విషయం కాదు' అన్నారు కె. విశ్వనాథ్.

    English summary
    Kalatapaswi K.viswanath says he is not Happy with Dada saheb Phalke award
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X