twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా దృష్టిలో వాటికి విలువ లేదు: రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : అవార్డులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. కేరళలోని కోవలమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(ఐఫా)లో బాహుబలి నామినేషన్‌కు సంబంధించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు గాను ఆయన పై విధంగా స్పందించారు.

    తనకు అవార్డులపై అంత ఆసక్తి ఉండదని తన దృష్టిలో వాటికి ఎలాంటి విలువ లేదన్నారు. అయితే తన చిత్రంలో పనిచేసిన వారికి ఎవరికైనా అవార్డులు వస్తే మాత్రం సంతోషిస్తానన్నారు. ఎందుకంటే అవి వారికి ప్రోత్సాహాన్నిస్తాయని తద్వారా వారు ఇంకా బాగాపని చేసేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు

    I am not interested in awards: SS Rajamouli

    ‘బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ పండితుల ఊహకు కూడా అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.

    పలు అంతర్జాతీయ పత్రికలలో సైతం ‘బాహుబలి' గురించి మెయిన్ హెడ్డింగ్ లలో వచ్చింది, అంతేకాకుండా బుసాన్ వంటి ప్రముఖ ఇంటర్నేషనల్ వర్షన్‌తో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమవుతోంది. ఇక ఈ ఫెస్టివల్స్‌లో వచ్చిన క్రేజ్ ద్వారా మరికొన్ని రోజుల్లో చైనా, జపాన్‌లలో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ విడుదల కానుంది.

    English summary
    “I am not interested in awards. I don’t see any value for them,” Rajamouli said when asked for his reaction to the nomination of the Telugu version of Baahubali for the International Indian Film Academy awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X