» 

బికినీ అయినా లిప్ కిస్ అయినా రెడీ అంటున్న'లోకమే కొత్తగా' హిరోయిన్ ..!

Posted by:
 

ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా చిత్రసీమలోకి అడుగుపెట్టితనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సంపాదించకుంది అదితి అగర్వాల్. 'లోకమే కొత్తగా' సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోన్న అదితి అగర్వాల్, ఈ సారి తాను సినిమా కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకున్ననంటోంది. 'గంగోత్రి' సినిమా టైం లో తాను కెరీర్ నిసీరియస్ గా తీసుకోలేదనీ, అక్క ఆర్తి అగర్వాల్ హీరొయిన్ కావడం తో, అనుకోకుండానే హీరొయిన్ అయినా, అప్పట్లో చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టడం తో తెలుగు సినిమా పరిశ్రమ పై ఆసక్తి పెట్టలేదనీ, ఇప్పుడు మాత్రం కెరీర్ ని సీరియస్ గా తీసుకుని, టాలీవుడ్ లో స్థిరపడాలని అనుకుంటున్నట్లు అదితి అగర్వాల్ చెబుతోంది.

రీ - ఎంట్రీలో 'లోకమే కొత్తగా' సినిమా తనకు మంచి సక్సెస్ ఇస్తుందని అదితి అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సినిమా కెరీర్ లో నిలదొక్కుకోవడానికి అక్క ఆర్తి అగర్వాల్ సూచనల్ని తూచ తప్పకుండా పాటిస్తానని అంటోంది అదితి అగర్వాల్. గ్లామర్ అనేది సినీ పరిశ్రమలో సర్వసాధారణ మైన విషయమనీ, బికినీ అయినా, లిప్ కిస్ అయినా సీన్ డిమాండ్ ని బట్టే ఉంటుందని చెబుతోన్న అదితి అగర్వాల్, పరోక్షం గా ఎలాంటి అందాల్ ప్రదర్శన కైనా తాను రెడీ.. అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Read more about: ఆర్తి అగర్వాల్, అదితి అగర్వాల్, శివాజి, లోకమే కొత్తగా, గంగోత్రి, aarthi agarwal, aditi agarwal, shivaji, lokame kothaga, gangotri

Telugu Photos

Go to : More Photos