twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ‘మహాభారతం’: ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్

    రాజమౌళి మహాభారతంపై ఎన్టీఆర్ స్పందించారు. అందులో చేయడానికి సిద్ధమే అన్నారు.

    By Bojja Kumar
    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవ కుశ' సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మీడియా వారితో చిట్ చాట్స్ చేస్తున్న ఆయనకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి చేయబోయే 'మహా భారతం' గురించిన ప్రశ్న కూడా ఎదురైంది.

    దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ.... రాజమౌళి 'మహాభారతం' తీస్తే, ఆ సినిమాలో తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తానని, తనకి ఏ పాత్ర ఇవ్వాలో రాజమౌళికి తెలుసని అన్నారు. రాజమౌళి మహాభారతం ఎప్పుడు తీస్తారో తనకు తెలియదని, దాని గురించి రాజమౌళి మాట్లాడితేనే బాగుంటుందన్నారు.

    బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ చేస్తానో? లేదో? తెలియదు

    బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ చేస్తానో? లేదో? తెలియదు

    ఈ నెల 24న బిగ్ బాస్ మొదటి సీజన్‌ పూర్తవుతుంది. సెకండ్ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. దాని గురించి ఇప్పుడే ఆలోచించాలని అనుకోలేదు. భవిష్యత్‌లో చేస్తానా, చేయనో ఇప్పుడే చెప్పలేను. బిగ్‌ బాస్‌ నాకు ఛాలెంజింగ్‌గా, ఎగ్జయిటింగ్‌గా అనిపించిన కాన్సెప్ట్‌. అసలు షో ఎలా ఉంటుందోనని భయం అందరిలో ఉండేది. కానీ అన్నీ భయాలను పక్కన పెడితే ప్రేక్షకులు కొత్తదనాన్ని యాక్సెప్ట్‌ చేయడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ అన్నారు.

    జై లవ కుశలో ఇష్టమైన పాత్ర

    జై లవ కుశలో ఇష్టమైన పాత్ర

    ఈ చిత్రంలో జై పాత్ర కోసం ఎక్కువగా కష్టపడ్డాను కాబట్టి ఆ పాత్రంటే ఇష్టమెర్పడింది. మిగతా క్యారెక్టర్స్‌ను తక్కువ చేయడం కాదు కానీ జై, లవ, కుశల్లో ఏ ఒక్క క్యారెక్టర్‌ను పక్కకు పెట్టినా, కథకు సంపూర్ణత ఏర్పడదు. రావణాసురుడిని ఆరాధించే క్యారెక్టర్‌ జై. ఇన్‌టెన్స్‌ ఉన్న పాత్ర ఇది. జై పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే కథ వెళుతుందని ఎన్టీఆర్ అన్నారు.

    'జై లవకుశ' చాలా ఎమోషనల్‌ మూవీ

    'జై లవకుశ' చాలా ఎమోషనల్‌ మూవీ

    తల్లిదండ్రులు వారి బిడ్డలకు మంచి మార్గం ఏదీ, చెడు మార్గం ఏది అని చెప్పాలి. అలా చెప్పకుంటే వారిపై బయటి విషయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యం. అలా బయట కొన్ని కారణాల ప్రభావంతో ముగ్గురు బిడ్డల తల్లి కల చెదిరిపోతుంది. మళ్లీ ఆ తల్లి కల నిలబడుతుందా? నిజమవుతుందా? రావణ రామ లక్ష్మణులు మళ్లీ రామ లక్ష్మణ భరతులు అవుతారా? అనేదే ఈ సినిమా. 'జై లవకుశ' చాలా ఎమోషనల్‌ మూవీ... అని ఎన్టీఆర్ అన్నారు.

    బాధ్యతతో పాటు కాస్త ఒత్తిడి ఉండేది

    బాధ్యతతో పాటు కాస్త ఒత్తిడి ఉండేది

    నాకు, అన్నయ్యకు ఎప్పటి నుండో కలిసి సినిమా చేయాలని కోరిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో సినిమూ చేయడం ఇంకాస్తా బాధ్యతను పెంచింది. యాదృచ్చికమో మరేమో కానీ అన్నదమ్ములు కలిసి చేసిన సినిమాలో అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేసే కథే అదృష్టంగా దొరికింది. బయటి బేనర్‌లో, మీ స్వంత బేనర్‌లో సినిమా చేయడానికి తేడా ఏంటని మీరు అడిగితే, ఈ సినిమాను మా తల్లిదండ్రులకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. కాబట్టి నాకైనా, అన్నకైనా బాధ్యతతో పాటు ఒత్తిడైతే ఉండేది.... అని ఎన్టీఆర్ అన్నారు.

    English summary
    "I am ready to do Rajamouli's Mahabharata, will do any role, he knows what character is good me," NTR said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X