twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి తప్ప అందరూ.., ‘అఖిల్’పై వినాయక్ క్షమాపణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ తెరకెక్కించిన ‘అఖిల్' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా ప్లాపైన తర్వాత వినాయక్ అసలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. తాజాగా ఏలూరులో సినీరిప్రజంటేటర్స్ కు ఎల్ ఐ సీ బాండ్ల పంపిణీ కార్యక్రమంలో వినాయక్ ఈ విషయమై స్పందించారు.

    అఖిల్ సినిమా విషయంలో తప్పుజరిగిందని, ఈ విషయంలో అభిమానులు, సినిమా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలని ఆయన అన్నారు. కథ కొత్తఉందని ఆ సినిమా తీసానని, ఈ విషయంలో తాను తప్పు చేసానని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి తప్ప అందరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారు. తొలిసారి తాను తప్పు చేసినట్లు ఫీలవుతున్నాను, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయను అని తెలిపారు.

    I Am Sorry For Akhil's Failure: VV Vinayak

    చిరంజీవి 150వ సినిమాకు వినాయక్ దర్శకత్వం....
    చిరంజీవి 150వ సినిమా గురించి రామ్ చరణ్ ఇటీవల ఫిల్మీబీట్ స్పెషల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు.

    చిరంజీవి 150వ సినిమాను జనవరి, 2016లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సురేఖ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఠాగూర్ మధు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం వివి వినాయక్ స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నారు.

    English summary
    VV Vinayak admitted committing a mistake in the form of 'Akhil - The Power of Jua'. "I urge Fans and Industry Folks to forgive me. I will make sure such mistake won't be repeated again,' he told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X