twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవార్డు కొనుక్కున్నా.... : సీనియర్ స్టార్ సంచలన ప్రకటన

    By Bojja Kumar
    |

    ముంబై: సినిమా రంగానికి సంబంధించి అవార్డులు అందుకోవడం అంటే ఎంతో గొప్పగా చూసేవారు ఒకప్పుడు. అయితే రాను రాను సినీ రంగంలో అవార్డులకు విలువ లేకుండా పోతోందనే విమర్శకూడా ఉంది. అందుకు కారణం కొందరు స్టార్స్ పేరు, పాపులారితీ కోసం అవార్డులను డబ్బిచ్చి కొనుక్కుంటున్నారనే ఆరోపణలు ఉండటమే.

    తాజాగా ఈ అవార్డుల అంశానికి సంబంధించి బాలీవుడ్ సీనియర్ స్టార్ రిషీ కపూర్ చేసిన కామెంట్స్..... అవార్డుల విలువను మరింత దిగజార్చేలా ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇటీవల 'ఖుల్లాం ఖుల్లా' పేరుతో తన ఆత్మకథ విడుదల చేసిన ఆయన... తాజాగా ఆయన ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్ దేశాయ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒకప్పుడు తాను ఫిల్మ్ ఫేర్ అవార్డులను కొనుక్కున్నట్లు వెల్లడించారు.

    I bought a film award for RS 30,000 in 1973: Rishi Kapoor

    1973లో 'బాబీ' సినిమాతో హీరోగా పరిచయమైన రిషీకపూర్ 1974 లో ఆ చిత్రానికి ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ అవార్డును తాను అప్పట్లో రూ.30,000కు కొనుక్కున్నానని, తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడ్డానని, మళ్లీ అలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదని రిషీ కపూర్ తెలిపారు.

    ఆ కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే...... డబ్బుకు తప్ప మరే విషయానికి విలువ ఇవ్వని ఇప్పటి రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. అలా అని అవార్డులను అవమానించడం కాదు కానీ.... ఈ కాలంలోనూ అవార్డులను డబ్బు ఇచ్చి కొనుక్కునే వారు లేక పోలేదను అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ మొదలుతోంది.

    English summary
    "Yes, I bought a film award for RS 30,000 in 1973; I am ashamed of what I did but was young and rich!" Rishi Kapoor said in a interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X