twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ మీద మీకన్నా వంద రెట్లు ఎక్కువే :రామ్ చరణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మీరు పవన్ కళ్యాణ్ సభలో ఉండాలని ఎంత గట్టిగా కోరుకుంటున్నారో...మీకన్నా ఎక్కవ వందరెట్లు నాకుంది. మీరు ఎప్పుడు సభలో పవర్ స్టార్ అని అరిచినా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు మైక్ ఇచ్చినా నాకు కూడా అలాగే అరవాలని ఉంటుంది. మీరూ అరిచి, నేనూ అరచి, బాగుండదు కాబట్టి నేను ఎప్పుడూ మాట్లాడను. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ లేదా నాకు ఆయన మీద ఉన్న ప్రేమ పబ్లిక్ గా చెప్పుకోనక్కర్లేదు.

    మీకు మీ మమ్మీ,డాడీ మీద ప్రేమ ఉందో లేదో పబ్లిక్ గా చెప్పుకోనక్కర్లేదు. అలాగే మేము చెప్పుకోము ఎప్పుడూ. ఫర్వాలేదు..మీరు అరుస్తూనే ఉండండి.మేం లోపల దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అన్నారు రామ్ చరణ్. ఆయన తాజాగా హాజరైన పిల్లా నువ్వు లేని జీవితం ఆడియో పంక్షన్ లో అభిమానులంతా పవర్ స్టార్ అని అరుస్తూంటే ఇలా స్పందించారు.

    నగరంలోని శిల్పకళావేదికలో 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ నటుడు, ఎంపీ చిరంజీవి హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు.

    సాయిధరమ్ తేజ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. రెజీనా హీరోయిన్ . బన్నీ వాస్, హర్షిత్ నిర్మాతలు. ఎ.యమ్. రవికుమార్ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

    స్లైడ్ షోలో...

    ఆవిష్కరణ

    ఆవిష్కరణ

    థియోటర్ ట్రైలర్ ని వి వి వినాయిక్ ఆవిష్కరించారు. ఆడియో సీడిలను మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరించి రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు అందించారు. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.

    అల్లు అరవింద్ మాట్లాడుతూ...

    అల్లు అరవింద్ మాట్లాడుతూ...

    ఈ సినిమా అనేక అడ్డంకులను దాటి విడుదలకు రెడీ అవుతోంది. సాయి ధరమ్ తేజ వెనక ఎంత మంది హీరోలు ఉన్నా మొదటి ఆటకే పరిమితం. మిగతాదంతా తన టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. తేజ్ బోర్న్ ఆర్టిస్టు. అన్ని రకాల కళలు ఉన్న హీరో. ఈ సినిమాలో దిల్ రాజు నాకు ప్రతీ విషయంలో సపోర్టు చేసారు. రవికుమార్ చౌదరి రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అనూప్ గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. అన్నారు.

    దిల్ రాజు మాట్లాడుతూ...

    దిల్ రాజు మాట్లాడుతూ...

    ఈ టైటిల్ ను దేవిశ్రీ ప్రసాద్ సూచించారు. పవన్ కళ్యాణ్ సాంగ్ పల్లవినే ఈ టైటిల్ గా పెట్టాం. ఈ సినిమా షూటింగ్ లో ఉండగా శ్రీహరిగారు చనిపోవటం భాధాకరం. ఈ సినిమాని ఆయనకే అంకితం ఇస్తున్నాం. రవికుమార్ సినిమాని చక్కగా డైరక్ట్ చేసారు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    నిర్మాత పోకూరు బాబూరావు గారు నాకు దర్శకుడుగా జన్మనిస్తే...ఈ సినిమాతో అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు నాకు మరో జన్మ ఇచ్చారు. అల్లు అరవింద్ గారు బ్యానర్ లోనో, దిల్ రాజు గారి బ్యానర్ లోనో చేస్తే చాలని అనుకుంటారు. కానీ నేను ఇద్దరి కలయికలో సినిమా చేస్తున్నా..చాలా హ్యాపీగా ఉంది.

    ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ..

    ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ..

    ఈ సినిమాలో నాకు అవకాసం ఇచ్చినందకు దర్శక,నిర్మాతలకు ధాంక్స్. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది. సాయి ధరమ్ పెద్ద హీరో అవుతాడు.

    అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...

    అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...

    ఈ సినిమాకు పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. రెండు పెద్ద బ్యానర్స్ కలయికలో పనిచేసాను. సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు.

    నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ...

    నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ...

    సాయిధరమ్ తేజకు, టీమ్ కు ఆల్ ది బెస్ట్..సినిమాపెద్ద విజయం సాధించాలి అన్నారు.

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ....

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ....

    అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ మంచి సహనంతో సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. తనని దగ్గర నుంచి చూసాను. ఖచ్చితంగా రాక్ చేస్తాడు అన్నారు.

    జగపతిబాబు మాట్లాడుతూ...

    జగపతిబాబు మాట్లాడుతూ...

    ఈ ఆఫర్ నాకు శ్రీహరి గారు చనిపోవటం వల్ల వచ్చింది. చాలా ఆలోచించాను. అయితే ప్రతీ రోజు ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా చేసాను అన్నారు.

    వివి వినాయిక్ మాట్లాడుతూ...

    వివి వినాయిక్ మాట్లాడుతూ...

    తమ్ముళ్లను, చెల్లెళ్లను ఎలా చూసుకోవాలి, వాళ్ల పిల్లలను ఎలా చూసుకోవాలి అని అన్నయ్య చిరంజీవిగారిని చూసి తెలుసుకోవాలి. ఆయనతో నడిపిన ప్రతీ క్షణం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ఏ హీరోను చూసిన ఆయన డ్యాన్స్ చూసినట్లుగానే ఉంటుంది. తేజ్ మంచి హీరోగా ఎదుగుతాడు అన్నారు

    హీరో మాట్లాడుతూ...

    హీరో మాట్లాడుతూ...

    ఈ సినిమా గురించి చెప్పాలంటే అరవింద్ మామ, దిల్ రాజు మామ గురించి చెప్పాలి. అరవింద్ గారు, దిల్ రాజు గారి వంటి ఇద్దరు పెద్ద నిర్మాతలతో కలిసి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉనంది. రవికుమార్ గారు ప్రేక్షకులను ఈ సినిమాతో డిఫెరెంట్ లోకాలకి తీసుకెళ్లిపోతారు అన్నారు.

    నాగబాబు మాట్లాడుతూ...

    నాగబాబు మాట్లాడుతూ...

    మా అందరికీ ఇష్టమైన మేనల్లుడు, మా తేజ మంచి హ్యూమన్ బీయింగ్. తను భవిష్యత్ లో పెద్ద హీరో అవుతాడు అన్నారు.

    రెజీనా మాట్లాడుతూ...

    రెజీనా మాట్లాడుతూ...

    అనూప్ మంచి మ్యాజిక్ ఇచ్చాడు. బన్నివాస్, హర్షిత లతో కలిసి పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. డైరక్టర్ రవికుమార్ గారు సినిమాని చక్కగా డైరక్ట్ చేసారు. తేజ్ మంచి కో స్టార్. తనతో పనిచేయటం హ్యాపీగా ఉంది అన్నారు.

    అల్లు అర్జున్ మాట్లాడుతూ...

    అల్లు అర్జున్ మాట్లాడుతూ...

    శ్రీహరి గారు మా ఫ్యామిలీ క్లోజ్. ఆయన చేసిన రోల్ ని జగపతిబాబు గారు పెద్ద మనస్సుతో చేయటం అనేది ఆయన గొప్పతనం. మాకోసం ఆయన ఈ రోల్ చేసినందుకు ధాంక్స్. రవికుమార్ చౌదరిగారు కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. లేట్ అయినా లేటెస్ట్ గా ఉంటుంది అన్నారు.

     రామ్ చరణ్ మాట్లాడుతూ...

    రామ్ చరణ్ మాట్లాడుతూ...

    తేజ్ మంచి హ్యూమన్ బీయింగ్. తనకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. మనం సినిమాకు అతను ఇచ్చిన మ్యూజిక్ చూసి అతను ఫ్యాన్ అయ్యాను అన్నారు.

    చిరంజీవి మాట్లాడుతూ...

    చిరంజీవి మాట్లాడుతూ...

    నా మెదటి సినిమా రిలీజ్ అయినప్పుడు నేనెలా ఫీలయ్యానో ఇప్పుడు నేనలాగే ఫీలవుతున్నాను. రామ్ చరణ్ తో పాటు తేజ్ నాకు మరో బిడ్డ. తను మా ఇంట్లోనే పెరిగాడు. నా మొదటి సినిమాకంటే రెండో సినిమా ప్రాణం ఖరీదు ముందుగా రిలీజైంది. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. శ్రీహరి ఆశీస్సులు ఈ సినిమాకు ఎప్పుడూ ఉంటాయి. ఈ ఇండస్ట్రీకి మరో ప్రకాష్ రాజ్ లాంటి నటుడుగా జగపతిబాబు ఎదుగుతాడు అన్నారు.

    తుఫాన్ సహాయ నిథికి

    తుఫాన్ సహాయ నిథికి

    విశాఖపట్నం తుపాను బాధితుల సహాయార్థం చిరంజీవి అభిమానులు సేకరించిన రూ.10లక్షలకు సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించేందుకు ఆయనకు అందించారు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    కార్యక్రమంలో నటులు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తేజ్‌, హీరో సాయి ధరమ్‌తేజ్‌, హీరోయిన్‌ రెజీనా, నాగబాబు, దిల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    "I know You (fans) have been wishing to see Pawan Kalyan on this stage. Even I wish to see him here and that's 100 times more than you. I usually don't speak when you chant Pawan Kalyan's name. Why because I too want to shout Powerstar if I have a mike in hand. I can't say how much I love him and how much he loves me publicly. Its like the kind of love you show on your mother and blood brothers. You just keep chanting Powerstar, we would enjoy that in our heart."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X