twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి సినిమా నచ్చలేదు: స్టార్ డైరెక్టర్ కామెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా దాదాపు రూ. 650 కోట్ల వసూళ్లు సాధించి సౌతిండియా సినిమా పరిశ్రమలో రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి తొలి భాగం చూసిన వారంతా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    అయితే ప్రముఖ సౌతిండియా దర్శకుడు గౌతం మీనన్ మాత్రం ‘బాహుబలి' లాంటి సినిమాలు తనకు నచ్చవని అంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి లాంటి సినిమాలు నాకు నిజంగా నచ్చవు. ఎందుకంటే నేను ఫాంటసీ కథలకు అభిమానిని కాదు. టీవీలో కూడా గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ వంటి కాకుండా మహిళా సీరియళ్లే ఇష్టపడతాను' అని చెప్పుకొచ్చాడు.

    I did not like Bahubali: Gautham Menon

    గౌతం మీనన్ ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. తాజాగీ ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమా రాబోతోంది.

    రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రోడ్డుపై బైక్ ఉండటాన్ని బట్టి ఇదొక అడ్వెంచరస్ రోడ్ ట్రిప్పుకు సంబంధించిన కాన్సెప్టుతో సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే టైటిల్ లోగోలో ‘సాగిపో'..అనేది ‘పారిపో' అనిపించేలా డిజైన్ చేసారు. దీన్ని బట్టి సినిమాలో సాహసం శ్వాసగా సాగిపోతాడా... లేక పారిపోతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

    I did not like Bahubali: Gautham Menon

    ‘ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... ‘సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేయబోతున్నారు. ‘ఏ మాయ చేసావె' టైటిల్ మాదిరిగానే ఈ టైటిల్ కూడా ఒక్కడు మూవీ సాంగ్ లిరిక్ నుండి తీసుకున్నదే కావడం గమనార్హం. సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు పిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

    English summary
    Director Gautham Menon expresses his opinion on Bahubali that has catapulted Telugu cinema in a big way. “I don’t really like films like Bahubali. I am not a big fan of fantasy. I would rather watch Desperate Housewives than a Game Of Thrones.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X