» 

వాళ్లు మోసగాళ్లా..? శేఖర్ కమ్ముల మాటల్లో అర్థమేంటి!

Posted by:
 

హైదరాబాద్: దర్శకుడు శేఖర్ కమ్ముల త్వరలో 'అనామిక' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నయనతార టైటిల్ రోల్ చేస్తున్న ఈచిత్రం త్వరలో విడుదల కానుంది. హిందీలో విద్యా బాలన్ హీరోయిన్‌గా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ'కహానీ' చిత్రంలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లను తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

హిందీ వెర్షన్‌లో విద్యా బాలన్ గర్భవతిగా కనిపిస్తుంది. అయితే తెలుగు వెర్షన్లో మాత్రం నయనతార మామూలుగానే కనిపిస్తోంది. ఇలాంటి మార్పు ఎందుకు చేసారు? అని అడిగితే శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. 'కహాని అనేది ఒక మంచి కథాంశం. అయితే అందో చీటింగ్ చేసే ఎలిమెంట్ నాకు నచ్చ లేదు. అదే విధంగా ఇలాంటి కల్పితఅంశాలను చూపెట్టి ప్రేక్షకులను మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు' అని సమాధానం ఇచ్చారు. మరి శేఖర్ కమ్ముల మాటల్లోని అర్థం ఏమిటి....???

కహాని చిత్రాన్ని తెలుగులో తీయాలనే ఆలోచన ఎందుకొచ్చిందనే దానిపై శేఖర్ కమ్ముల సమాధానం ఇస్తూ....ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కారణాన్ని చెబుతూ,'వయాకామ్ వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చి సినిమా తీయమని అడిగారు. నాకది బాగా నచ్చింది. ప్రొడ్యూసర్స్ దర్శకులను వెతుక్కుంటూ రావడమనే ట్రెండ్ చాలా మంచిది. ఈ సినిమా చేయడానికి అది కూడా ఒక కారణం' అన్నారు.

కహాని చితం చూసిన తర్వాత నాలో సరికొత్త ఆలోచన చిగురించింది. అప్పటికే దిళ్ షుక్ నగర్, లుంబినీ పార్క్ సంఘటనలు జరిగాయి. దాంతో కహానిలో ని ఓ త్రెడ్ తీసుకుని కథను మార్చి సినిమా తీయాలనుకుని తీసిన చిత్రమే "అనామిక'' ఇది హిందీ సినిమాకు రీమేక్ ఎంతమాత్రం కాదు అన్నాడు చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల.

మన వ్యవస్థ ఎలా ఉంది. దాన్ని ఓ అమ్మాయి ఎలా ఎదుర్కొంది అనేది ఇందులో ప్రధాన అంశం. టెర్రరిజం అంటే ఓల్డ్ సిటీ అని కాకుండా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అక్కడ తీయాల్సి వచ్చింది. అనామిక ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

Read more about: nayantara, shekar kammula, anamika, keeravani, నయనతార, శేఖర్ కమ్ముల, అనామిక, కీరవాణి
English summary
“Kahaani had a brilliant script, but I didn’t like the ‘cheat element’ in the film.” Sekhar Kammula said.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos