»   » రూమర్స్ హల్ చల్, వివరణ ఇచ్చిన అక్కినేని అఖిల్

రూమర్స్ హల్ చల్, వివరణ ఇచ్చిన అక్కినేని అఖిల్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ హీరోగా పరిచయం అవుతున్నాడనే విషయం బయటకు వచ్చినప్పటి నుండే ఆయన ఎంట్రీపై భారీ అంచనాలు, ఊహించనంత హైప్ ఏర్పడింది. అఖిల్ తొలి సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించడం, నితిన్ నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

అయితే అందరినీ నిరాశ పరుస్తూ ‘అఖిల్' మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు, కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు తీరని నష్టాన్ని మిగిలిచ్చింది. అయితే అఖిల్ మాత్రం వెంటనే మరో సినిమా అవకాశం దక్కించుకున్నాడని, అతని నెక్ట్స్ మూవీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్నాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

I have not signed any project at the moment: Akhil

నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని, దర్శకుడు పూరి జగన్నాధ్ అఖిల్ ను హీరోగా నిలబెట్టేందుకు పకడ్బందీ స్క్రిప్టు తయారు చేసినట్లు ఫిల్మ్ నగర్లో గత కొంత కాలంగా రూమర్స్ హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై అపీషియల్ సమాచారం ఏమీ లేక పోవడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.

ఈ నేపథ్యంలో అయోమయాన్ని తొలగించేందుకు అఖిల్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘ప్రస్తుతం తాను ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం నెక్ట్స్ ప్రాజెక్టు విషయమై వర్క్ చేస్తున్నాను. ఈ సమయంలో సహనం అనేది ఎంతో ముఖ్యం' అని అఖిల్ ట్వీట్ చేసారు.

English summary
"Clearing the air, I have not signed any project at the moment. Working on it, during this time I have learned that patience is important!" Akhil tweeted.
Please Wait while comments are loading...