twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓరల్ సెక్స్ చేశా, నేను క్రిమినల్‌నే: డైరెక్టర్ హన్సల్ మెహతా

    By Pratap
    |

    న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల అంశంలో ఢిల్లీ కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం కొనసాగితే తాను ఓ క్రిమినల్‌నేనని ఆయన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 377 ప్రకారం ముఖరతి (ఓరల్ సెక్స్)కు పాల్పడిన తాను చట్టం దృష్టిలో నేరస్థుడనని అన్నారు.

    సెక్షన్ 377 స్వలింగ సంపర్కులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఒకవేళ చట్టం అమల్లోకి తెస్తే భారత్‌లో అత్యధికమంది ఆ సెక్షన్ ప్రకారం నేరస్థులవుతారని హన్సల్ మెహతా అన్నారు. అత్యధికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని రద్దు చేయడానికి నాజ్ ఫౌండేషన్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు.

    అలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2012లో షాహిద్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకొన్న హన్సల్ మెహత్.. స్వలింగ సంపర్కం కథాంశంగా అలీగఢ్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    I’m a criminal, I’ve had oral sex: Hansal Mehta

    అలీగడ్‌పై విశాల దృక్పథం చూపండి : షబానా అజ్మీ

    సినిమాటోగ్రఫీ చట్టాన్ని అనుసరించకుండా విశాల దృక్పథంతో వ్యవహరించాలని సెన్సార్ బోర్డు సభ్యులకు ప్రముఖ నటి షబానా అజ్మీ సూచించారు. స్వలింగ సంపర్కం నేపథ్యంగా రూపొందించిన అలీగఢ్ చిత్ర ట్రైలర్‌కు ఏ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    సెన్సార్ బోర్డు మోడరన్ ఫిల్మ్ సర్టిఫికెట్‌గా వ్యవహరించాలని ఆమె సూచించారు విశాల దృక్పథంతో ఉండాల్సిన సెన్సార్ బోర్డు సభ్యులు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు. వాటిని మార్చాల్సిన అవసరం ఉంది అని ఆమె అన్నారు.

    Read more about: hansal mehta gay sex
    English summary
    As the Supreme Court gives its final verdict to the curative petition submitted by the Naz Foundation, an NGO that stands for gay rights, on Article 377 (which makes gay sex, irrespective of age and consent, a punishable offence), filmmaker Hansal Mehta says that if the law is to stay on, even he’s a criminal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X