twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీసం మెలేసి పవన్ యుక్తా లో ఏం మాట్లాడారు..ఫ్యాన్స్ కు ఏం చెప్పారు? (ఫొటోలు, వీడియోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఉక్తా సెలబ్రేషన్స్ లో పాల్గొనటానికి పవన్‌ కల్యాణ్‌ లండన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి రాగానే తన కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రం కోసం పవన్‌ కొత్త గెటప్‌ని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

    మీసం మెలేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలోని పాత్రకి తగ్గట్టుగానే ఆయన ఈ గెటప్‌లోకి మారినట్టు సమాచారం. పవన్‌కల్యాణ కొత్త చిత్రం త్వరలోనే మొదలుకాబోతోంది కాబట్టే ఈ లుక్ అంటున్నారు. మీరు అందుకు సంభందించిన వీడియోలు, ఫొటోలు ఈ క్రింద చూడవచ్చు.

    లండన్‌లోని త్రాక్సిలో నిర్వహించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఉక్తా) 6వ వార్షికోత్సవం, జయతే కూచిపూడి, జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకల్లో పవన్‌ పాల్గొన్నారు. ఆ వేడుకల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

    ఇక ఆయన అక్కడ అభిమానులతో ముచ్చటిస్తూ మాట్లాడారు..

    పవన్ అభిమానుల తరుపున అక్కడ అడిగిన అనేక ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా అజిత్ తో పవన్ మల్టి స్టారర్ చేస్తారా అనే విషయం గురించి సైతం ఆయన క్లారిటీ ఇచ్చారు.

    ఫొటోలు, వీడియోలు స్లైడ్ షోలో ..

    పవన్ తో స్టేజీపై సెల్ఫీ దిగుతూ కళాకారులు

    పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తో సెల్ఫీ దిగుతున్నామన్న ఆనందం వాళ్ల కళ్లల్లో కనిపిస్తోంది.

    అజిత్ తో సినిమా గురించి

    అజిత్ తనకు మల్టి స్టారర్ చేసే అవకాసం వస్తే తప్పకుండా చేస్తానని పవన్ హామీ ఇస్తూ...

    పవన్ మాట్లాడుతూ...

    పవన్ మాట్లాడుతూ...

    కళ సంస్కృతిలో ఓ అంతర్భాగం. నా సినిమాల ద్వారా మనవైన సంప్రదాయాల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటా అన్నారు.

    అందుకే నా సినిమాలో జానపదం

    అందుకే నా సినిమాలో జానపదం

    సంప్రదాయాలను ప్రోత్సహించాలనేదే నా ఆలోచన.అందులో భాగంగానే నా సినిమాల్లో జానపద గీతాలు వినిపిస్తుంటాయి అన్నారు పవన్

    నిర్వహించాలి

    నిర్వహించాలి

    తెలుగు సంప్రదాయాల్ని భావితరాలకి పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు తరచూ నిర్వహిస్తుండాలి అన్నారు పవన్.

    మర్చిపోకూడదు..

    మర్చిపోకూడదు..

    మన భాషని, యాసని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ విషయంలో ప్రవాస తెలుగు ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమ అన్నారు పవన్.

    ఆహ్దాదాన్ని ఇచ్చేదిగా

    ఆహ్దాదాన్ని ఇచ్చేదిగా

    'కళ అనేది నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే విధంగా ఉండాలి అన్నారు.

    ముఖ్య అతిధిగా

    ముఖ్య అతిధిగా

    యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా లండన్‌లో నిర్వహించిన 'జయతే కూచిపూడి జయతే బతుకమ్మ' సాంస్కృతిక వేడుకలకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి

    బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి

    తెలుగు కళలు, సంస్కృతి ప్రపంచానికి చేరువ కావడానికి తాను ప్రచార కర్త (బ్రాండ్ అంబాసిడర్)గా ఉండటానికి సిద్ధమే అన్నారు.

    కృషి చేస్తాను

    కృషి చేస్తాను

    ఇంకా పవన్ మాట్లాడుతూ - సినిమాల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తాను అన్నారు.

    నా సినిమాల్లో...

    నా సినిమాల్లో...

    తెలుగునాట వివిధ ప్రాంతాలకు చెందిన జానపద గీతాలు నా సినిమాల్లో ఉండేలా చూసుకుంటాను.

    సహాయపడతాయి

    సహాయపడతాయి

    మన సంప్రదాయాల్ని భావితరాలకు చేరువ చేయడంలో ఈ తరహా ఉత్సవాలు ఎంతో సహాయపడతాయి.

    సహాయపడతాయి

    సహాయపడతాయి

    మన సంప్రదాయాల్ని భావితరాలకు చేరువ చేయడంలో ఈ తరహా ఉత్సవాలు ఎంతో సహాయపడతాయి.

    అభినందనీయం

    అభినందనీయం

    దీనికి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి అభినందనీయం'' అన్నారు.

    నృత్యప్రదర్శన

    నృత్యప్రదర్శన

    ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జానపద నృత్య ప్రదర్శన ఆహూతులను, ప్రేక్షకులను అలరించింది.

    అదే లుక్

    అదే లుక్

    ఈ వేడుకల్లో పవన్ లుక్ అందర్నీ ఆకర్షించింది. అందరూ దీని గురించే మాట్లాడుకోవటం కనిపించింది

    ఇదే లుక్ తో

    ఇదే లుక్ తో

    డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఈ లుక్‌తో కనిపిస్తారని సమాచారం.

    వారి పాత్ర

    వారి పాత్ర

    సంస్కృతి, కళలను ఇప్పటి తరానికి తెలియజేయడంలో తల్లిదండ్రులు పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు.

    యక్షగానం

    యక్షగానం

    ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దశావతారం, మహిషాసురమర్థని, యక్షగానం ఆకట్టుకుంది

    జ్ఞాపికలు

    జ్ఞాపికలు

    ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు పవన్‌ కల్యాణ్‌ జ్ఞాపికలను బహూకరించారు.

    సంచలనం

    సంచలనం

    వేడుకులకు అవార్డు ఫంక్షన్ లకు దూరంగా ఉండే పవన్ కల్యాణ్ ఈ పంక్షన్ కు హాజరు కావటం సంచలనమైంది

     మరుగున పడిపోతాయని

    మరుగున పడిపోతాయని

    పెరిగిపోతున్న పాశ్చాత్య వాతావరణంలో తెలుగు సాంప్రదాయాలు మరుగున పడిపోతాయేమో అన్న భయం తనకు కలుగుతోంది అంటూ కామెంట్స్ చేసారు పవన్.

    అంతేకాదు ...

    అంతేకాదు ...

    తెలుగు సాంప్రదాయాల్ని ప్రోత్సహించటానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెపుతూ సంకేతాలు ఇచ్చాడు.

    గ్రాండ్ వెలకం

    గ్రాండ్ వెలకం

    లండన్ లో పవన్ కళ్యాణ్ కు నిర్వాహకులు, అభిమానుల నుండి గ్రాండ్ వెల్ కం లభించింది.

    భారీగా

    భారీగా

    భారీ సంఖ్యలో అభిమానులు లండన్ ఎయిర్ పోర్టుకు తరలి వచ్చారు.

    ర్యాలీగా

    ర్యాలీగా

    పదుల సంఖ్యలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఆయన్ను అక్కడి నుండి ర్యాలీగా తీసుకెళ్లారు.

    మురసిపోతున్నారు

    మురసిపోతున్నారు

    పవన్ కళ్యాణ్ లండన్లో మొదటి సారి ఎన్నారైల వేడుకలో పాల్గొనేందుకు రావటంతో అక్కడ అభిమానులు మురసిపోతున్నారు.

     ఫ్రెండ్ తో కలిసే..

    ఫ్రెండ్ తో కలిసే..

    పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాత శరత్ మరార్ కూడా వచ్చారు.

    ఫ్యాన్స్ హడావిడి

    ఫ్యాన్స్ హడావిడి

    లండన్ ఎయిర్ పోర్టు వద్ద పవన్ కళ్యాణ్ రాక సందర్బంగా అభిమానులు జాతీయ జెండా ప్రదర్శిస్తూ హడావుడి చేసారు.

    అదిరిపోయింది

    అదిరిపోయింది

    యుక్తా నిర్వాహకులు, అభిమానుల సమక్షంలో పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్ కం లభించింది.

    పవన్ చేతుల మీదుగా

    పవన్ చేతుల మీదుగా

    యుక్తా వేడుకల్లో కూచిపూడి నాట్యారామం కళాకారులను, సాంప్రదాయ కూచిపూడి కళాకారులను, గబ్బర్ సింగ్ ఫేం జానపద సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ ను పవన్ కళ్యాణ్ సన్మానించటంతో వారు చాలాహ్యాపీ ఫీలయ్యారు

    ఉత్కంఠ

    ఉత్కంఠ

    అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని ముందుగా నిర్వహికులు తెలిపారు. అయితే ఆయన ప్రసంగంలో ఏయే అంశాలు వస్తాయనేది హాట్ టాపిక్ అయింది.

    ఫొటోలే ఫొటోలు

    ఫొటోలే ఫొటోలు

    పవన్ మాట్లాడుతున్నంతసేపు ఫొటోలు, వీడియోలు వరసగా తీస్తూనే ఉన్నారు అభిమానులు

    ఫ్యాన్స్ తో

    ఫ్యాన్స్ తో

    దీంతో పాటు లండన్ లోని అభిమానులతో పవన్ కళ్యాణ్ ఫోటో సెషన్లో పాల్గొనంతగా ఫొటోలు దిగారని తెలుస్తోంది.

    మన మీడియాలోనూ

    మన మీడియాలోనూ

    పవన్ కళ్యాణ్ రాకతో యుక్తా వేడుకలు తెలుగు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి.

    జరిగాయి

    జరిగాయి

    'యుక్తా'కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగాయి.

    నిర్వాహకులు

    నిర్వాహకులు

    తెలుగు జాతిపై అభిమానంతో ఈ కార్యక్రమానికి పవన్ కాళ్యాణ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు.

    లేడీ ఫ్యాన్స్ సైతం

    లేడీ ఫ్యాన్స్ సైతం

    అక్కడ లండన్ లో పవన్ ..మహిళా అభిమానులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.

    సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో

    సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో

    పవన్ లండన్ యాత్రకు సంభందించిన విశేషాలు..ఎప్పటికప్పుడు అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేస్తూనే ఉన్నారు.

    ఇక్కడ అభిమానులు

    ఇక్కడ అభిమానులు

    తమ హీరో లండన్ యాత్రను ఇక్కడ అభిమానులు మీడియాద్వారా, సోషల్ మీడియాద్వారా చూస్తూ,విశేషాలు తెలుసుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

    ట్రెండింగ్

    ట్రెండింగ్

    పవన్ లండన్ యాత్ర ఇక్కడ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ గా నిలిచింది.

    మరో ప్రక్క

    మరో ప్రక్క

    ఇదంతా ఇలా ఉంటే ..ఇక్కడ మన మీడియాలో మాత్రం.. తమ జనసేన పార్టీ బలోపేతం చేయటానికి అక్కడనుంచి కూడా సపోర్ట్ తీసుకునేందుకే పవన్ వారిని కలుస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడటం విశేషం.

    English summary
    After these riveting performances, the performing artists and the European Telugu associations were presented with mementos by Pawan Kalyan, Chief guest of the occasion. Speaking on this occasion, he expressed that he would like to be a brand ambassador of Telugu art and culture and take this to the wider reach of the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X