twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చుందట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు నటి హేమ నటుడు శివాజీ రాజాపై తీవ్రస్థాయిలో మండి పడుతోంది. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో తనను తుప్పుప్పటిన యంత్రం అని వ్యాఖ్యానించడంపై ఆమె మాదాపూర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి? ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను, న్యాయం జరిగే వరకు పోరాడుతాను అన్నారు.

    ఈ విషయంపై చిరంజీవితో మాట్లాడుతానని, ఇంకా పవన్‌కళ్యాణ్ ఇంటికెళ్లి కూర్చుంటానని స్పష్టం చేశారు. పవన్ అందరికీ మంచి చేస్తాడు కదా.. తనకు మంచి చేయమని అడుగుతానని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని దాసరి నారాయణరావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఎన్నికల అనంతరం సమస్య పరిష్కరిద్దామని దాసరి చెప్పారని మేమ తెలిపారు.

     I Will Sit In Pawan Kalyan's House For Justice: Hema

    'మా' తరపున నాగేంద్రబాబు బిల్డింగ్ కొన్న విషయంపై నేను మాట్లాడాను. ప్రస్తుతం ఆ బిల్డింగ్ అమ్మితే రూ.30 లక్షలు కూడా రావని తాను చెప్పానన్నారు. దాంతో హేమకు మాట్లాడటం రాదు, ఆమెకు ఏం తెలియదని శివాజీ రాజా వ్యాఖ్యానించడం సంస్కారం కాదన్నారు.

    శివాజీ రాజా మాట్లాడుతూ...నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్ లో ఉంటే బావుంటుందని అన్నారు. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తరుపున పోటి చేస్తున్న ఆయన ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం హేమకు ఏముందని ప్రశ్నించారు. వీలుంటే మంచి చేయాలని హితవు పలికారు.

    వారు ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హేమ మీపై ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటారని అంటున్నారుగా అని ప్రశ్నించగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చని, తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. తాను గొప్ప పోరాటయోధుడినని తెలిపారు.

    English summary
    Hema filed complaint with Madhapur police station on Saturday night and told media, "Shivaji Raja has described me as Tuppu Pattina Yantram (Rusted Machine) in the TV channel discussion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X