» 

ఇలియానా ‘బర్ఫీ’ చిత్రం టాక్ ఏంటి?

Posted by:

హైదరాబాద్: సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా...బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రా, ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సినిమా క్రిటిక్స్ ఈచిత్రానికి మంచి రేటింగ్ ఇచ్చారు.

ఈచిత్రం ఒక చెవిటి, మూగ వ్యక్తి కథ. రణబీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. రణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్ పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు. జిల్మిల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటకు మంచి మార్కులు పడ్డాయి. సౌత్ లో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న ఇలియానా ఈ చిత్రంలో శృతి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బర్ఫీ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్.

బర్పీ రివ్యూ...చదవండి

ఇక ఇలియానా సినీ కెరీర్ విషయానికొస్తే...ఇటీవల ఆమె అల్లు అర్జున్‌తో కలిసి నటించిన 'జులాయి' చిత్రం సూపర్ హిట్ అయింది. దానికంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజతో కలిసి ఇలియానా నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

ప్రస్తుతం ఇలియానా ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌‍కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more about: ileana, ranbir kapoor, priyanka chopra, ఇలియానా, రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా
English summary
Barfi, directed by Anurag Basu is undoubtedly one of the best and intelligent films to be churned out in a long time. Accepting oneself with all shortcomings, loving each other and smiling your way all the way upto the finish line - this is how one can describe Barfi! Barfi inspires, moves and delves into the inner strength of individuals. Once the curtains are drawn, you are left behind with a feeling of joy and peace. Barfi, starring Ranbir Kapoor, Priyanka Chopra and Ileana D'Cruz in the lead is full of life and you end up loving each and every character.
Please Wait while comments are loading...