twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ స్టేట్ మెంట్: నా చెత్త సినిమాలు చూసి హిట్ చేయకండి...ఫ్యాన్స్ కు సూచన

    By Srikanya
    |

    హైదరాబాద్: తమళ స్టార్ హీరో సూర్య కు తెలుగులోనూ మార్కెట్ ఎక్కువే. ఈ మధ్యన అంటే సినిమాలు వర్కవుట్ కాక వెనకపడ్డారు కానీ సింగం,గజనీ వంటి చిత్రాలు ఇక్కడ తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసాయి. అందుకేనేమే ఆయన తన తాజా చిత్రం '24'ని భారి ఎత్తున తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆడియో పంక్షన్ ఘనంగా చేసారు.

    గ్లోబల్‌ సినిమాస్‌, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంయుక్తంగా అందిస్తున్నాయి. జ్ఞాన్‌వేల్‌ రాజా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆడియో విడుదల సందర్బంగా చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని సైతం వదిలారు.

    సూర్య నటిస్తూ నిర్మించిన చిత్రం '24'. ఈ సినిమా పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. సమంత, నిత్య మేనన్‌ హీరోయిన్స్. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

    సూర్య మాట్లాడుతూ... ఇటీవల జరిగిన ప్లస్ టూ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు కఠినంగా ఉన్నాయని 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తలు మనసును చాలా బాధించాయన్నారు. చావు దేనికీ పరిష్కారం కాదని, చదువనేది జీవితాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికే అన్నారు.

    జీవించడానికి చాలా మార్గాలు ఉన్నాయని సూర్య అన్నారు. తాను కాలేజీ చదువు వరకూ చాలా వేస్ట్‌గా జీవించాననీ, ఆ తరువాత తన తండ్రి హితబోధతో తనకుంటూ ఒక మార్గాన్ని ఎంచుకుని ఈ స్థాయికి చేరుకున్నాననీ అన్నారు. ప్రతి మనిషికి ఒక మంచి రోజు వస్తుందన్నారు. దానికి సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చునని సూర్య హిత వ్యాఖ్యలు చేశారు.

    ఆడియో పంక్షన్ హైలెట్స్ ఇక్కడ చూడండి...

    ఈ చిత్రం ట్రైలర్

    ఈ చిత్రం ట్రైలర్

    ఈ చిత్రం ట్రైలర్, ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం చెన్నైలోని సత్యం సినీ మాల్‌లో జరిగింది. చిత్ర ట్రైలర్‌ను నటుడు కార్తీ, ఆడియోను ఏఆర్.రెహ్మాన్ ఆవిష్కరించారు.

    సూర్య మాట్లాడుతూ...

    సూర్య మాట్లాడుతూ...

    నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రమిది. ‘మనం' తరవాత విక్రమ్‌ నా దగ్గరకు వచ్చారు. నాలుగున్నర గంటల పాటు కథ చెప్పి ఒప్పించారు.

    అంతబాగా నచ్చింది..

    అంతబాగా నచ్చింది..

    కథ చెప్తున్న ఆ సమయంలో కనురెప్పలు మూయడం కూడా మర్చిపోయా. కథ పూర్తవగానే లేచి చప్పట్లు కొట్టా. అంత బాగా నచ్చింది అన్నారు సూర్య

    అందుకే నిర్మాతగా..

    అందుకే నిర్మాతగా..

    ఇలాంటి సినిమాతో నేనే నిర్మాతగా మారాలి అనుకొన్నా. అందుకే ఆ బాధ్యతలూ స్వీకరించా అన్నారు సూర్య

    ఉపవాసాలు అయినా...

    ఉపవాసాలు అయినా...

    వెంటనే రెహమాన్‌గారి తలుపు తట్టాం. ఆ సమయంలో ఆయన రంజాన్‌ ఉపవాసాలు ఉంటున్నారు.

    అయినా సరే...

    అయినా సరే...

    మా కథ విని ‘ఈ సినిమా నేను చేస్తున్నా' అన్నారు. దాంతో మరింత ఉత్సాహం వచ్చింది. నాకిప్పుడు ఓ మంచి విజయం కావాలి. చాలా ప్రశ్నలకు ఈ సినిమా ఓ సమాధానంగా నిలుస్తుంది''అన్నారు.

    మంచి టీమ్

    మంచి టీమ్

    సూర్య మాట్లాడుతూ... ఈ చిత్రానికి మంచి టీమ్ అమిరిందని , అందరూ మనస్ఫూర్తిగా 24 చిత్రానికి పని చేశారని అన్నారు.

    చెత్త వద్దు..

    చెత్త వద్దు..

    తన అభిమానులకు తాను చెప్పేదొక్కటే మంచి చిత్రాలను విజయవంతం చేయండి. చెత్త చిత్రాలను ఆదరించకండి అన్నారు సూర్య. తాను ద్విపాత్రాభినయమే వద్దనుకుంటే ఇందులో త్రిపాత్రాభినయం చేయించారని సూర్య పేర్కొన్నారు.

    వారే లేకపోతే..

    వారే లేకపోతే..

    దర్శకులు లేనిదే తానీ స్థాయిలో సాధించేవాడిని కాననీ అన్నారు. 24 చిత్రం చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఈ చిత్రం విషయంలో ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు.అలాగే దర్శకుడు విక్రమ్‌కుమార్ గురించి ఒక్క మాట చెప్పాలన్నారు.ఆయన అవకాశం వచ్చిన చోటుకు వెళ్లి విజయాలను సాధిస్తున్నారన్నారు.

    సూర్య తండ్రి మాట్లాడుతూ...

    సూర్య తండ్రి మాట్లాడుతూ...

    ఈ సందర్భంగా సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ మాట్లాడుతూ నటుడు కమలహాసన్ సకలకళావల్లభుడు బిరుదుతో వెలిగిపోతున్నప్పుడు ప్రఖ్యాత దర్శకుడు స్వర్గీయ కే.బాలచందర్ తనను సెలైంట్ సకలకళావల్లభుడు అని పేర్కొన్నారన్నారు. అలా సూర్య సెలైంట్ కిల్లర్ అని అన్నారు.

    కార్తి మాట్లాడుతూ ...

    కార్తి మాట్లాడుతూ ...

    ‘‘24 అనేది చాలా మంచి టైటిల్‌. కథ విన్న తరవాత ఈ టైటిల్‌ ఎందుకు పెట్టారా అని గంట సేపు ఆలోచించా. ఆ తరవాత అర్థమైంది. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. రెహమాన్‌గారు నా స్ఫూర్తి. ఆయన ఈ చిత్రానికి పాటలు అందించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది''అన్నారు.

    అఖిల్ మాట్లాడుతూ..

    అఖిల్ మాట్లాడుతూ..

    ‘‘గజిని చూసి నటుడంటే ఇలా ఉండాలి అనుకొన్నా. సినిమా సినిమాకి అన్ని గెటప్పులు ఎలా మారుస్తారో అర్థం కాదు. నా రెండో సినిమాకి సంబంధించి ఆయన్ని సలహా అడగాలి''అన్నారు అఖిల్‌.

    సమంత చెబుతూ ....

    సమంత చెబుతూ ....

    ‘‘నా తొలి సినిమాకే తన పాటలతో నాకు జీవితాన్నిచ్చారు రెహమాన్‌. ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. తన పాటలతో ఈ సినిమానీ ఎక్కడికో తీసుకెళ్లారు. విక్రమ్‌ గారు ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డా. ఇలాంటి సినిమా తీయగలుగుతారా? అనిపించింది. కానీ చెప్పిన దానికంటే బాగా తీశారు. సూర్య మూడు పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా ఆయన మాత్రమే చేయగలరు'' అంది.

    రెహమాన్‌ మాట్లాడుతూ .....

    రెహమాన్‌ మాట్లాడుతూ .....

    ‘‘ఈ అవకాశం ఇచ్చిన సూర్య, విక్రమ్‌లకు కృతజ్ఞతలు. మా అబ్బాయి అమీన్‌ తన తొలి పాట అరబిక్‌లో పాడాడు. ఆ తరవాత ఈ సినిమా కోసం పాడాడు. తనకు మీ ఆశీస్సులు కావాలి. ఈ సినిమా బాగా ఆడాలని దేవుణ్ని కోరుకొంటున్నా'' అన్నారు.

    ఈ కార్యక్రమంలో....

    ఈ కార్యక్రమంలో....

    డి.సురేష్‌బాబు, వంశీ పైడిపల్లి, దిల్‌రాజు, చంద్రబోస్‌, శశాంక్‌ వెన్నెలకంటి, అజయ్‌, నల్లమలపు బుజ్జి, అమిత్‌, అనూప్‌ రూబెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Suriya Sivakumar, who is a household name in the Telugu land, was in Hyderabad yesterday to launch his upcoming movie, 24's audio. His brother Karthi, music director A R Rahman, Samantha, director Vikram graced the occasion while Akhil Akkineni, director Koratala Siva were at the event as the chief guests.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X