twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివిధ నేరాల్లో జైలుకెళ్లిన సినీతారలు...(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సాధారణ వ్యక్తులు తప్పులు చేసి జైలు కెళ్లితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ....సెలబ్రిటీల, ముఖ్యంగా ప్రజా జీవితంలో ముడి పడి ఉండే సినీ తారలు, రాజకీయ నాయకులు జైలు కెళితే మాత్రం అదో సెన్సేషనే. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్...మద్యం తాగి వాహనం నడిపి ఒకరి ప్రాణాలు తీసిన కేసులో దోషిగా తేలాడు. అతనికి ఎంత కాలం జైలు శిక్ష పడనుందనేది కోర్టు మరి కొన్ని గంటల్లో తేల్చనుంది.

    ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభ విస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ మాత్రమేకాదు...గతంలో చాలా మంది స్టార్స్ వివిధ నేరాల్లో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కొందరు నేర ఆరోపణలపై, మరికొందరు నేరాలు రుజువై జైలుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షైనీ ఆహుజా, మాధుర్ బండార్కర్, జాన్ అబ్రహం, ఫరీద్ ఖాన్, మోనికా బేడీ, మధుబాల తదితరులు ఉన్నారు.

    కారణం ఏదైనా....వెండి తెరపై వివిధ పాత్రలు పోషించి, అనేక రకాలుగా ఎంటైర్ చేసి తమ అభిమాన్ని చూరగొన్న సినీతారలు జైలు కెళ్లడం అంటే అభిమానులను కాస్త బాధించే అంశమే. కానీ చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా! తప్పు ఎవరు చేసినా తప్పే....

    సినీ తారలు జైలుకెళ్లిన కారణాలపై ఓ లుక్కేద్దాం...

    సల్మాన్ ఖాన్

    సల్మాన్ ఖాన్

    బాలీవుడ్ మోస్ట్ పవర్ ఫుల్ స్టార్స్ లో సల్మాన్ ఒకరు. అప్పట్లో జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. తాజాగా ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వారిపై తాగి వాహనం నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైన కేసులె జైలు గడపతొక్కబోతున్నాడు.

    సంజయ్ దత్

    సంజయ్ దత్

    బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఐదేళ్ల జైలు శిక్షకు గురయి ప్రస్తుతం ఎరవాడ జైలులో గడుపుతున్నాడు.

    సైఫ్ అలీ ఖాన్

    సైఫ్ అలీ ఖాన్

    నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తాజ్ హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్టయ్యారు. కొన్ని గంటలు జైల్లో గడిపి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.

    షైనీ ఆహుజా

    షైనీ ఆహుజా

    మరో బాలీవుడ్ నటుడు షైనీ ఆహుజా పని మనిషిని రేప్ చేసిన కేసులో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత ఆమె కేసు విత్ డ్రా చేసుకోవడంతో విడుదలయ్యారు.

    మోనీకా బేడీ

    మోనీకా బేడీ

    అండర్ వరల్డ్ డాన్ అబూ సలెం గర్ల్ ఫ్రెండ్ మోనికా బేడీ పాస్ పోర్ట్ ఫోర్జరీ కేసులో జైలు కెళ్లారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయింది.

    మధుర్ బండార్కర్

    మధుర్ బండార్కర్

    మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు మధుర్ బండార్కర్ 2006లో రేప్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తనను లైంగికంగా అనుభవించాడని ప్రతి జైన్ ఆయనపై కోర్టు కెక్కింది. అయితే ఆరోపణలు రుజువు కాక పోవడంతో అతనికి ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది.

    మధుబాల

    మధుబాల

    పాత తరం బాలీవుడ్ నటి మధు బాల కూడా జైలు గడప తొక్కారు. దర్శకుడు బిఆర్. చోప్రా నుంచి అడ్వాన్స్ తీసుకుని కూడా నటించడానికి నిరాకరించడంతో జైలు కెళ్లాల్సి వచ్చింది.

    జాన్ అబ్రహం

    జాన్ అబ్రహం

    బైకు రైడింగ్ అంటే తెగ మోజు పడే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం...అతి వేగంగా తన స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఇద్దరిని గాయ పరిచారు. ఈ కేసులో జాన్ 15రోజులు జైల్లో గడిపాడు.

    ఫరీద్ ఖాన్

    ఫరీద్ ఖాన్

    మరో బాలీవుడ్ నటుడు పరీద్ ఖాన్ కొకైన్ తీసుకున్న కేసులో 2001లో ఆయన్ని అరెస్ట్ చేసారు.

    English summary
    Everyone of us has a favorite movie star. We love their characters and also tries to follow them in real life. They inspire us, encourages us to work for the society and in may ways. We saw them in many different roles in movies including police or army officers, social workers, leader, super heroes, who works for the humanity but in real life they also are normal people like us and present a totally different image. Unfortunately, some of them also knocked the doors of the jail.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X