twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాష్మోరా’ సెట్స్, గ్రాఫిక్స్... బాహుబలితో పోటీ పడుతున్నాయా? (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కార్తీ హీరోగా పి.వి.పి.సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా'. ఈ సినిమాను అక్టోబర్‌ 28న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్‌ హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.

    ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'కాష్మోరా' సినిమా అంతా విజువల్‌ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడి ఉందనే విషయం సినిమా స్టార్టింగ్‌లోనే తెలుసు. బాహుబలి తర్వాత ఆడియెన్స్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఓ స్టాండర్డ్‌ను ఫిక్స్‌ అయ్యారు. బాహుబలి తర్వాత సినిమా షూటింగ్‌ను రెండు నెలలు పాటు ఆపేసి డిజైన్స్‌ , వి.ఎఫ్‌.ఎక్స్‌ వర్క్‌పై డిస్కస్‌ చేసి రీవర్క్‌ చేశామని తెలిపారు.

    వి.ఎఫ్‌.ఎక్స్‌వర్క్‌ కోసం 25 కంపెనీలు

    వి.ఎఫ్‌.ఎక్స్‌వర్క్‌ కోసం 25 కంపెనీలు

    ఈ సినిమా వి.ఎఫ్‌.ఎక్స్‌వర్క్‌ కోసం 25 కంపెనీలు వర్క్‌ చేశాయి. 1800 షాట్స్‌ ఉన్నాయి. 90 నిమిషాల పాటు గ్రాఫిక్‌ వర్క్‌ ఉంది. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. దర్శకుడు గోకుల్‌ అండ్‌ టీం నిద్రహారాలు మాని ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. ఇంకా వర్క్‌ చేస్తున్నారని తెలిపారు.

    19 భారీ సెట్లు

    19 భారీ సెట్లు

    కాష్మోరా చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది. మొత్తం 19 భారీ సెట్లు వేసాం. షూటింగు కోసం ఓ ఫ్యాక్టరీని రెండేళ్ళ పాటు లీజుకు తీసుకున్నాం. అందులో 12 సెట్స్‌ భారీ వేసాం. ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవన్‌గారు అద్భుతమైన డిజైన్స్‌ చేశారు అని కార్తి తెలిపారు.

    స్పెషల్ కాస్టూమ్స్

    స్పెషల్ కాస్టూమ్స్

    కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకప్పుడు మన సంస్కృతిలో మొఘల్‌ సంస్కృతి కలగలిసి ఉండటంతో రాజ్‌నాయక్‌ అనే క్యారెక్టర్‌ కోసం అలాంటి కాస్ట్యూమ్స్‌ను డిజైన్‌ చేశాం. త్రీడీ ఫేస్‌ స్కాన్‌ టెక్నాలజీని ఉపయోగించాం. ఈ టెక్నాలజీ కోసం బెంగుళూరులోని ఓ టీంను ఉపయోగించామని కార్తి తెలిపారు.

    మగధరలో మాదిరిగా...

    మగధరలో మాదిరిగా...

    'మగధీర'లో ఓ థర్టీ మినిట్స్‌ పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఎలా ఉంటుందో అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో రాజ్‌నాయక్‌ అనే క్యారెక్టర్‌ కనపడుతుంది. దీపావళి ఫెస్టివల్‌కు తగిన విధంగా అన్నీ ఎలిమెంట్స్‌ కలగలిసిన సినిమా ఇది. ఆరవై శాతం హ్యుమర్‌, సెటైరికల్‌ కామెడి ఉంటే ముప్పై శాతం హర్రర్‌, పీరియాడికల్‌ కాన్సెప్ట్‌తో సినిమా రన్‌ అవుతుందని తెలిపారు.

    దర్శకుడిపై నమ్మకం

    దర్శకుడిపై నమ్మకం

    రెండు సినిమాలను మాత్రమే చేసిన దర్శకుడు గోకుల్‌తో ఇలాంటి మూవీ ఏ నమ్మకంతో చేశారని నన్ను అడిగారు. దర్శకుడు గోకుల్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా రాజ్‌నాయక్‌ పాత్ర కోసం చాలా రీసెర్చ్‌ చేశారు. ఆ పాత్ర దుస్తుల కోసమైతే పన్నెండు డిజైన్స్‌ను వద్దని చివరకు ఓ డిజైన్‌ను సెలక్ట్‌ చేసుకున్నారని తెలిపారు.

    కమల్ హాసన్ గుర్తొచ్చాడు

    కమల్ హాసన్ గుర్తొచ్చాడు

    ముప్పై నిమిషాల పాటు ఉండే పీరియాడికల్‌ పార్ట్‌లో రెండు రాజ్యాలను తెరపై ఆవిష్కరించడం అంటే చిన్న విషయం కాదు. పది రెట్లు ఎనర్జీతో చేస్తేనే క్యారెక్టర్‌ బాగా పండింది. ఇలాంటి క్యారెక్టర్స్‌ చేస్తున్నప్పుడు నాకు దశావతారంలో కమల్‌హాసన్‌గారు గుర్తుకు వచ్చారు. నటనలో వేరియేషన్స్‌ చూపించడానికి కష్టపడ్డాననే చెప్పాలి. ముఖ్యంగా హార్స్‌ రైడింగ్‌ చేసేటప్పుడు బాగా కష్టమనిపించింది. కాష్మోరా అనే క్యారెక్టర్‌లో సెటైరికల్‌ కామెడి ఉంటుంది. ఇక కాష్మోరా క్యారెక్టర్‌కు, రాజ్‌నాయక్‌ క్యారెక్టర్‌కు ఉన్న రిలేషన్‌ ఏంటనేది తెరపై చూడాల్సిందే అని తెలిపారు.

    ఎన్టీఆర్‌గారు, శివాజీగణేషన్‌గారి ఎఫెక్ట్‌ కనపడకుండా

    ఎన్టీఆర్‌గారు, శివాజీగణేషన్‌గారి ఎఫెక్ట్‌ కనపడకుండా

    రాజ్‌నాయక్‌ క్యారెక్టర్‌కు ఓ బాడీలాంగ్వేజ్‌ ఉంటుంది. అలాంటి ఓ క్యారెక్టర్‌ను చేసేటప్పుడు ఎన్టీఆర్‌గారు, శివాజీగణేషన్‌గారి ఎఫెక్ట్‌ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్‌ ఉండకుండా నాజర్‌గారి వద్ద ట్రయినింగ్‌ తీసుకున్నామని తెలిపారు.

    నయనతారతో లవ్ సీన్స్ లేవు

    నయనతారతో లవ్ సీన్స్ లేవు

    నయనతార ఈ సినిమాలో రాణి పాత్రలో కనిపిస్తుంది. శ్రీదివ్య కూడా ఓ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాలో నాకు, నయనతారకు మధ్య పెద్దగా లవ్‌ సీన్స్‌ లేవు. యాక్షన్స్‌ సీన్స్‌ ఉన్నాయని కార్తి తెలిపారు.

    గ్రాండ్ రిలీజ్

    గ్రాండ్ రిలీజ్

    అరుంధతి, బాహుబలిలా గ్రాండ్‌గా, థ్రిల్లింగ్‌ ఉంటుంది. రెగ్యులర్‌ సోషియో ఫాంటసీ మూవీ. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. ఇలాంటి సినిమాను కార్తీ చేయడం పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. సినిమా అంతా తెలుగుదనం నిండి ఉంటుంది. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. కార్తీ కెరీర్‌లో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలవుతున్న సినిమా ఇదే. తెలుగు, తమిళంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రెండు వేల థియేటర్స్‌లో విడుదల చేస్తున్నమని నిర్మాత పివిపి తెలిపారు.

    ఎంత అందంగా ఉందో!

    ఎంత అందంగా ఉందో!

    వావ్... నయనతార ఎంత అందంగా ఉందో! నయనతార కాష్మోరా ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

    English summary
    Karthi has done two roles - Kaashmora and Raj Nayak in this film. There is a 30 minute period episode involving war. Other than that, Kaashmora is a social film with a fantasy element. Nayantara plays the role of a queen in period part and Sri Divya plays hero's love interest. Art director Rajeevan has designed 19 sets for this film. There are 1800 shots in this movie. There is a graphics work for 90 minutes in the movie. 25 different companies worked for the VFX in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X