twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బు రాదు, అవకాశాలూ రావు... మన సినీ అవార్డ్స్‌ దండగేనంట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతీయ సినీ అవార్డుల విషయంలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేసారు. మన దేశంలో ఇచ్చే సినిమా అవార్డులకు ఎలాంటి ప్రాధాన్యం లేదు... వాటి వల్ల నటులకు, దర్శకులకు ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు. ఆ అవార్డుల వల్ల డబ్బు రాదు, మంచి అవకాశాలూ రావు అని తేల్చి చెప్పారు ఇర్ఫాన్.

    బాలీవుడ్ తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఇర్ఫాన్.... హాలీవుడ్ లో ఇచ్చే అకాడెమీ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల గురించి గొప్పగా చెప్పారు. భారత్‌లో అవార్డులు ఎవరికీ ఉపయోగకరంగా ఉండట్లేదని వ్యాఖ్యానించిన ఇర్ఫాన్‌ ఖాన్‌, ఈ అవార్డులు గెలుచుకోవడం వల్ల నటీనటులకు.. దర్శకులను ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. వీటి వల్ల డబ్బులు రావు.. అవకాశాలు రావు. ఎందుకంటే వాటికి ప్రాధాన్యం లేకుండా పోతోందన్నారు.

    Irrfan Khan about Oscars, Indian awards

    అదే హాలీవుడ్‌లో అయితే అకాడమీ.. గ్లోబల్‌ అవార్డులకు ఎంతో ప్రాధాన్యముంది. ఎవరైనా ఆ అవార్డును గెలుచుకుంటే వారి కెరీర్‌ అమాంతం ఉన్నతస్థాయికి చేరుతుంది. మంచి సినిమా అవకాశాలు వస్తాయి. డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది' అని అవార్డులపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

    ఇండియాలో ఈ మధ్య కాలంలో సినీ అవార్డుల కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. టీవీ ఛానల్స్ నెట్వర్క్ వారు, మేగజైన్స్ వారు ప్రత్యేకంగా అవార్డుల కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇవన్నీ కేవలం ఆయా ఛానల్స్, మేగజైన్స్ పబ్లిసిటీ కోసం, ఆ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఎంటర్టెన్మెంట్స్ కార్యక్రమాలు నిర్వహించి వాటిని డబ్బు సంపాదించే షోలుగా తప్పితే..... అవార్డులు దర్శకులు, నటులకు ఎలాంటి ఉపమోగం ఉండటం లేదన్నది నిర్వివాదాంశం.

    English summary
    Winning awards don’t do anything for any actor or director. It will not get you more money or better offers since there’s no credibility to them. It’s not something that one puts in their resume.” Irrfan Khan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X