twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతరత్నను డబ్బులు పెట్టికొంటానన్న నటుడు.. వారించిన కళాతపస్వి.. ఏం జరిగిందంటే..

    కైకాల సత్యనారాయణ అంటే ఎస్వీ రంగారావు అంతటి నటుడు అని చెప్పుకొంటారు. ఆయన అందుకొన్న అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రశంసలే ఎక్కువ.

    By Rajababu
    |

    దక్షిణాది సినీ పరిశ్రమలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించే వారిలో నటుడు కైకాల సత్యనారాయణ ఒకరు. అందుకే అయనను నవరస నటనా సార్వభౌమ అని పిలచుకొంటారు. కైకాల సత్యనారాయణ అంటే ఎస్వీ రంగారావు అంతటి నటుడు అని చెప్పుకొంటారు. ఆయన అందుకొన్న అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రశంసలే ఎక్కువ. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడైన కైకాల సత్యనారాయణను సాక్షి మీడియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. ఆదివారం జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో అవార్డుతో సత్కకరించింది. ఈ అవార్డును కళాతపస్వి కే విశ్వనాథ్ అందజేశారు. ఈ సందర్బంగా విశ్వనాథ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవార్డును అందుకొన్న తర్వాత సత్యనారాయణ మాట్లాడుతూ.. తన నటజీవితంలో చోటుచేసుకొన్న విషయాలను చెప్పారు.

    ఆ ప్రశంస మరిచిపోలేను..

    ఆ ప్రశంస మరిచిపోలేను..

    అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడుతూ.. నా 50 ఏళ్ల నటజీవితాన్ని గుర్తించి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అందించినందుకు సాక్షి మీడియాకు ధన్యవాదాలు. ఈ అవార్డును నేను అర్హుడినా అనే బేరీజు వేసుకొంటే జీవితంలో రెండు అద్భుతమైన ప్రశంసలు నా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అవేమిటంటే మహానటుడు శివాజీ గణేషన్ ప్రశంస, బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ అప్రిసియేషన్ అని అన్నారు.

    ఎస్వీ రంగారావు అంతటి నటుడు..

    ఎస్వీ రంగారావు అంతటి నటుడు..

    ఒక సినిమా షూటింగ్ సందర్భంగా మహానటుడు శివాజీ గణేషన్ మాట్లాడుతూ.. నట దిగ్గజం ఎస్వీ రంగారావు అంతటి నటుడు సత్యనారాయణ అని అన్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ కలిస్తే అది కైకాల సత్యనారాయణ అవుతారు అని ప్రశంసించారని కైకాల తెలిపారు. అంతటి ప్రశంసను పొందిన తాను ఈ అవార్డుకు అర్హుడినేనని భావిస్తున్నాను అని కైకాల చెప్పారు.

    కర్మ చిత్రంలో అవకాశం అలా..

    కర్మ చిత్రంలో అవకాశం అలా..

    అలాగే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన కర్మ అనే సినిమాలో శ్రీదేవి అంకుల్‌గా నటించాను. ఆ పాత్ర కామెడీ టచ్ ఉన్న రోల్. ఆ పాత్ర కోసం సుభాష్ ఘాయ్ దక్షిణాదిలోని అగ్రనటుడిని తీసుకోవాలనుకొన్నారు. బెంగళూరులోని డిస్టిబ్యూటర్లను సంప్రదించగా నా పేరు చెప్పారట. అలాగే హైదరాబాద్‌లోని కొందర్ని అడుగగా వారు కూడా నా పేరు చెప్పారు. అలా కర్మ సినిమాలో నాకు ఆ పాత్ర లభించింది.

    సుభాష్ ఘాయ్ అలా అన్నారు..

    సుభాష్ ఘాయ్ అలా అన్నారు..

    ఆ షూటింగ్ సమయంలో సుభాష్ ఘాయ్ తన భార్యకు పరిచయం చేస్తూ.. సినీ పరిశ్రమలో సత్యనారాయణ గారు గొప్ప నటుడు. హిందీలో అశోక్ కుమార్, ప్రాణ్, అమ్రీష్ పురి, ఇంకా ఎందరో నటులు కలిస్తే సత్యనారాయణ అవుతారు అని చెప్పిన విషయాన్ని కైకాల చెప్పుకొచ్చారు. ఈ రెండు ప్రశంసలు నా నట ప్రతిభకు సాక్ష్యంగా నిలిచాయి అని సత్యనారాయణ అన్నారు. ఈ అవార్డుకు నేను అక్షరాల అర్హుడినేని భావిస్తున్నాను అని చెప్పారు.

    శారద పాత్రతో మలుపు..

    శారద పాత్రతో మలుపు..

    అలాగే తెరమీద హీరోయిన్లను విచ్చలవిడిగా రేప్‌లు చేసి.. అనేక హత్యల చేసే పాత్రల్లో పోషించే సమయంలో కళాతపస్వి విశ్వనాథ్ గారు నా కెరీర్‌ను మలుపు తిప్పారు. శారద చిత్రంలో అద్భుతమైన పాత్రను ఇచ్చి నా నట ప్రతిభను మరోసారి చాటిచెప్పారు. పచ్చి విలన్‌గా రాణిస్తున్న తనకు ఓ ఉదాత్తమైన పాత్రను కట్టబెట్టినందుకు విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. ఆ చిత్రం నుంచి శుభలేఖ, సూత్రధారుల వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం కల్పించారు అని కైకాల అన్నారు.

    కైకాల అద్భుతమైన నటుడు

    కైకాల అద్భుతమైన నటుడు

    ఈ సందర్బంగా దర్శకుడు విశ్వనాథ్ మాట్లాడుతూ.. కైకాల సత్యనారాయణ అద్బుతమైన నటుడు. ఎలాంటి పాత్రనైనా చాలా సులభంగా పోషిస్తాడు. శారద చిత్రంలో అద్భుతంగా నటించాడు. శుభలేఖ, సూత్రధారులు, సిరిసిరిమువ్వ చిత్రాల్లో ఆయన నటన అమోఘం. అలాంటి నటుడు భారతరత్న కావాలను కోరుకొన్నారు. ఓ దశలో డబ్బులు పెట్టి కొనేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే తానే వద్దని వారించాను. ఏదిఏమైనా భారతరత్న త్వరలో ఏమైనా వస్తుందో చూడాలి. ఆయన అన్ని అవార్డులకు అర్హుడే అని విశ్వనాథ్ అన్నారు. ..

    భారతరత్న కోసం ప్రయత్నించాడు..

    భారతరత్న కోసం ప్రయత్నించాడు..

    కైకాల సత్యనారాయణ అంటే ఎస్వీ రంగారావు అంతటి నటుడు అని చెప్పుకొంటారు. ఆయన అందుకొన్న అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రశంసలే ఎక్కువ. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడైన కైకాల సత్యనారాయణను సాక్షి మీడియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. అవార్డును అందుకొన్న తర్వాత సత్యనారాయణ మాట్లాడుతూ.. తన నటజీవితంలో చోటుచేసుకొన్న విషయాలను చెప్పారు.

    English summary
    Senior Actor Kaikala Satyanarayna felicited with Lifetime achievement award by Sakshi media Group. In this event Kaikala Satyanarayana, K Vishwanath shares their experiences and memories.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X