twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా సుబ్బిరామిరెడ్డి మాయ.. చిరు, పవన్ ఒక్కటయ్యారు.. కారణం అదేనా?

    ఏపీలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో అన్నదమ్ములిద్దరూ ఏకం కావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ప్రత్యేక హోదా అంశం ఏపీలో కీలకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ .

    By Rajababu
    |

    ఇటీవల కాలంలో ఒక వేదికపై కనిపించని మెగా బ్రదర్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారనే వార్త మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నింపింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి నటిస్తే చూడాలనే ప్రేక్షకుల కోరిక తీరింది. గత కొద్దికాలంగా మెగా క్యాంపుకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్న విషయం మెగా ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల ఒక్కటయ్యారనే విషయం ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తున్నది. కాగా ఏపీలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో అన్నదమ్ములిద్దరూ ఏకం కావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ప్రత్యేక హోదా అంశం ఏపీలో కీలకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పై జనసేన అధినేత వైఖరి మారిందనే వాదన వినిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జనసేన లోపాయికారి ఒప్పందం చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    టీఎస్సార్ మయా చేశాడా..

    టీఎస్సార్ మయా చేశాడా..

    మెగా బ్రదర్స్‌ను కలిసి సినిమా చేయడంలో పారిశ్రామికవేత్త, ఒకప్పటి సినీ నిర్మాత టీ సుబ్బిరామిరెడ్డి (టీఎస్సార్) కీలకపాత్ర పోషించారనే వార్త ఒకటి ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల హైదరాబాద్‌లో టీఎస్సార్ మనుమడి వివాహం శంషాబాద్‌ పరిసరప్రాంతంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెండ్లికి రిలయన్స్ అంబానీ కుటుంబంతోపాటు బాలీవుడ్ నటులు షారుక్, అనిక్ కపూర్, శ్రీదేవి, రణవీర్ లాంటి అగ్ర హీరోలు, హీరోయిన్లందరూ హాజరయ్యారు. ఈ పెండ్లిలో చిరంజీవి, పవన్ కల్యాణ్ తోపాటు మెగా హీరోలందరూ కనిపించారు.

    టీఎస్సాఆర్‌తో కలిసి చిరు డ్యాన్స్..

    టీఎస్సాఆర్‌తో కలిసి చిరు డ్యాన్స్..

    ఏ పెండ్లి వేదికపైనా డాన్స్ చేయని చిరంజీవి టీఎస్సాఆర్ ఇంట్లో జరిగిన పెండ్లిలో నృత్యం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. టీఎస్సాఆర్ అంటే చిరంజీవికి ప్రత్యేక అభిమానమని, వారిద్దరి మధ్య స్నేహపూరితమైన సంబంధాలున్నాయని.. అందుకే తన కుటుంబ పెళ్లిగా భావించి సంతోషంతో మెగాస్టార్ డ్యాన్స్ చేశారనే వాదన వినిపిస్తున్నది. అంతేకాకుండా చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రానికి టీఎస్సాఆర్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

    పవన్ కల్యాణ్ కోపానికి కారణమదేనా..

    పవన్ కల్యాణ్ కోపానికి కారణమదేనా..

    కాంగ్రెస్ నాయకుల పంచలూడ గొడుతానని పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి చిరంజీవి కేంద్రమంత్రి పదవిని పొందడంపై పవన్ కోపానికి కారణమని చెప్పుకొంటారు. ఆ తర్వాత చిరంజీవి మంత్రిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని పవన్ పలు సందర్భాల్లో జనసేన అధినేత మండిపడ్డారు.

    మెగా కుటుంబానికి దగ్గరగా.. హీరోలకు దూరంగా పవన్

    మెగా కుటుంబానికి దగ్గరగా.. హీరోలకు దూరంగా పవన్

    మెగా కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఆ క్యాంప్ హీరోలకు సంబంధించిన పలు సినీ కార్యక్రమాలకు పవన్ దూరంగా ఉన్నారు. నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఆహ్వానించినా ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే నితిన్, సాయి ధరమ్ తేజ లాంటి హీరోల కార్యక్రమాలకు హాజరవ్వడంతో మెగా క్యాంపుపై ఆగ్రహంగా ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. రాంచరణ్ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైనా ఆ ఫంక్షన్‌లో పవన్ ముభావంగానే కనిపించారు.

    పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు..

    పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు..

    జనసేన పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసిన తర్వాత మెగాస్టార్‌ చిరంజీవికి పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు మెగా ఫ్యామిలీ కలిసి ఉంటే ఎదురే ఉండదని పలువురి సూచనలు కూడా వర్కవుట్ అయినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల విడుదలకు ముందు పలు కార్యక్రమాల్లో నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలో పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా కుటుంబంతో పవన్ సన్నిహితంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

    జనసేన బలోపేతానికి అడుగులు

    జనసేన బలోపేతానికి అడుగులు

    గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ మధ్యకాలంలో సంబంధాలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. వెంకయ్యనాయుడు, టీడీపీ మంత్రులు, నేతలు పవన్‌పై పరోక్షంగానూ, ప్రత్యక్షంగాను దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేనను జనంలోకి తీసుకుపోవాలంటే తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం అసన్నమైంది. కుటుంబపరంగా ఒంటరిగా ఉంటే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంటతో ముందు ఫ్యామిలీ పరంగా బలంగా ఉండాలన్న మెగా క్యాంప్ ఆలోచన అని తెలుస్తున్నది. ఈ క్రమంలో మెగా, పవర్ స్టార్లను ఏకంగా కావడంలో టీఎస్సార్ చోరవ చూపినట్టు తెలుస్తున్నది.

    ప్రత్యేక హోదా ఇద్దరిని కలిపిందా

    ప్రత్యేక హోదా ఇద్దరిని కలిపిందా

    రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంపై అనుసరిస్తున్న వైఖరిపై పవన్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకోవాలన్నట్టుగా ఎన్డీయే ప్రభుత్వ చెప్పడం, అందుకు కేంద్రమంత్రులు వెంకయ్య, సుజనా చౌదరీలతోపాటు పలువురు ఏపీ ప్రభుత్వ మినిస్టర్లు వ్యవహరించడం పవన్‌కు ఇబ్బందిగా మారింది. దాంతో పవన్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. అవసరమైతే వైసీపీ నేత జగన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు.

    చిరంజీవిని సీఎంగా చూడాలన్నది..

    చిరంజీవిని సీఎంగా చూడాలన్నది..

    అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలన్నది పవన్ కల్యాణ్ కోరిక. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో సీఎం పదవిపై కన్నేసే వారే కరువయ్యారు. దాన్ని అసరాగా చేసుకొని చిరంజీవిని ఏపీలో సీఎంగా అభ్యర్థి ప్రకటిస్తే ఎలా ఉంటుందనే కాంగ్రెస్ ఉన్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ, టీడీపీకి పవన్ దూరమవుతున్న నేపథ్యంలో పవన్‌ను దగ్గరగా చేసుకోవాలని ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నది. ప్రస్తుతం పవన్, కాంగ్రెస్‌ల ముందు ఉన్న కామన్ ఎజెండా ప్రత్యేక హోదా. కాంగ్రెస్ ప్రత్యేక హోదాతో ఎన్నికల్లో ముందుకెళ్తే కొంత సానుకూలత వ్యక్తమయ్యే అవకాశముంది. జనసేన, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసిన ఫలితాల తర్వాత అన్నయ్య కోసం కాంగ్రెస్‌కు పవన్ మద్దతు అవకాశాలను కొట్టిపారేయ్యలేం. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా సుబ్బిరామిరెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.

    ఏకతాటిపైకి మెగా ఫ్యాన్స్ తెచ్చే..

    ఏకతాటిపైకి మెగా ఫ్యాన్స్ తెచ్చే..

    వేర్వేరు కుంపట్లవుతున్న మెగా ఫ్యాన్స్‌ను ఏకతాటిపైకి తీసుకురావడానికి కలిసి ఒకే చిత్రంలో నటిస్తే పరిస్థితి సానుకూలంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో టీఎస్సార్ చొరవ తీసుకొన్నట్టు సమాచారం. త్రివిక్రమ్‌తో కలిసి మెగా బ్రదర్స్ సినిమా చేస్తున్నట్టు గురువారం స్వయంగా టీఎస్సార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Mega brothers Pawan Kalyan, Chiranjeevi united. Congress men T subbirami Reddy successful in mediation. These two mega heros is going to do Multi starrer movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X