twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి, రోబో తడాఖా.. చుక్కలు చూపించనున్న శంకర్, రాజమౌళి

    వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఉత్తరాది సినీ పరిశ్రమదే హవా. అన్ని ప్రాంతీయ చిత్ర పరిశ్రమలన్నింటికీ బాలీవుడ్ మార్గదర్శకం. బాహుబలి, రోబో చిత్రాల తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

    By Rajababu
    |

    వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఉత్తరాది సినీ పరిశ్రమదే హవా. అన్ని ప్రాంతీయ చిత్ర పరిశ్రమలన్నింటికీ బాలీవుడ్ మార్గదర్శకం. ప్రయోగాత్మక చిత్రాలైనా, కమర్షియల్ సినిమాలైనా బాలీవుడ్ పెట్టింది పేరు. కలెక్షన్ల వసూలు లోనూ, భారీ ప్రాజెక్ట్‌లు నిర్మించడంలోనూ హిందీ చిత్ర పరిశ్రమ తర్వాత ఎవరైనా. అయితే సమకాలీన పరిస్థితుల్లో క్వాలిటీ సినిమాలు చేయడంలో బాలీవుడ్ వెనుకపడిందా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.

     బాహుబలి, రోబోలతో పరిస్థితి మారింది

    బాహుబలి, రోబోలతో పరిస్థితి మారింది

    విశాల భారతంలో దంగల్, సుల్తాన్, పీకే లాంటి చిత్రాలు వంద క్లబ్‌లో చేరి జబ్బలు చరుచుకొనేవి. తడాఖాను చూపించేవి. అయితే బాహుబలి1, రోబో చిత్రాలు వచ్చేవరకు బాలీవుడ్ హవాకు ఎదురేలేకపోయింది. బాహుబలి తర్వాత కేవలం ఉత్తరాది పరిశ్రమనే కాకుండా అంతర్జాతీయ సినిమా ఒక్కసారి దక్షిణాదిపై దృష్టిసారించింది. దక్షిణాదిలో ఉన్న మార్కెటింగ్ అవకాశాలు, కలెక్షన్ల వసూళ్లు చర్చనీయాంశమయ్యాయి.

     బాలీవుడ్‌పై పట్టు సాధిస్తున్న..

    బాలీవుడ్‌పై పట్టు సాధిస్తున్న..

    గతంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఉత్తరాది వారికి చిన్నచూపు ఉండేది. బాహుబలి, రోబో చిత్రాల తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలపై మోజు పెరిగింది. అందుకు కారణం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఫిల్మ్‌మేకర్స్ తపన, సినిమాల నిర్మాణంలో వారి క్వాలిటీ అందుకు కారణమైంది. అనేక కారణాల వల్ల ఇపుడు బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్ర పరిశ్రమనే బెటర్ అనే వాదన వినిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ వాదన నిజమనే భావన వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాది పరిశ్రమపై దక్షిణాది ఆధిపత్యం సాధించనున్నదనే వాదనకు ఈ నాలుగు చిత్రాలు ఉదాహరణగా నిలువనున్నాయి.

     విడుదలకు ముందే బాహుబలి2‌కు 500 కోట్లు

    విడుదలకు ముందే బాహుబలి2‌కు 500 కోట్లు

    బాహుబలి ది కన్‌క్లూజన్ నిర్మాణ వ్యయం రూ. 200 కోట్లు. బాహుబలి1 చిత్రానికి ఇది సీక్వెల్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొన్నది. రికార్డుస్థాయిలో రూ.600 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి సంచలనం స‌ృష్టించేందుకు బాహుబలి2 సిద్ధమైంది. బాహుబలి2 విడుదలకు ముందే రూ.500 కోట్ల బిజినెస్ చేసింది. విడుదల తర్వాత ఏ రెంజ్‌లో కోట్లు కొల్లగడుతుందో వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్ తదితరులు నటించారు.

     రికార్డు స్థాయిలో 2.0 శాటిలైట్ రైట్స్

    రికార్డు స్థాయిలో 2.0 శాటిలైట్ రైట్స్

    సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 రూపొందుతున్నది. కబాలితో దేశవ్యాప్తంగా అలజడి రేపిన సూపర్‌స్టార్ రజనీకాంత్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్ర బడ్జెట్ రూ.400 కోట్లు. ఇప్పటి వరకు ఆసియాలో అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన చిత్రంగా ఓ రికార్డు సొంతం చేసుకొన్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ రూ.110 కోట్లు వెచ్చించి జీ టెలివిజన్ దక్కించుకొన్నది. ఈ చిత్రం దీపావళీకి విడుదల కానున్నది.

    సౌత్ ఆసియాలోనే రికార్డుగా రాండామూజం

    సౌత్ ఆసియాలోనే రికార్డుగా రాండామూజం

    మలయాళ చిత్ర పరిశ్రమ రికార్డులను మోహన్‌‌లాల్ తిరుగరాశారు. గతేడాది ఆయన నటించిన ఓప్పం, పులిమురుగన్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. గతంలో ఎన్నడూలేని విధంగా పులిమురుగన్ చిత్రం రూ.150 కోట్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ రాండామూజం అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర బడ్జెట్ రూ.600 కోట్లు. దక్షిణాదిలో రజనీకాంత్ నటించే 2.0 చిత్రం కంటే ఈ చిత్ర బడ్జెట్ ఎక్కువ అనే విషయం గమనార్హం.

    రోబో, బాహుబలికి ధీటుగా తమిళ చిత్రం

    రోబో, బాహుబలికి ధీటుగా తమిళ చిత్రం

    బాహుబలి, రోబో చిత్రాల బాటలోనే తమిళ పరిశ్రమలో భారీ ప్రాజెక్ట్‌కు తెరలేపుతున్నారు. ఇప్పటివరకు పక్కా కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న సీ సుందర్ ఓ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సంఘమిత్ర పేరుతో నిర్మించేబోయే ఈచిత్రంలో విజయ్ నటించనున్నారు. ఈ చిత్ర బడ్జెట్ రూ.350 కోట్లు. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రహ్మాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం.

    నాలుగు చిత్రాలతో అగ్రస్థానం..

    నాలుగు చిత్రాలతో అగ్రస్థానం..

    బాహుబలి, రోబో, రాండామూజం, సంఘమిత్ర చిత్రాల విడుదల తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఖాయమనే అభిప్రాయాన్ని సినీ ప్రముఖులు, విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాణంలోనే కాక, సాంకేతికంగా ఉత్తమ చిత్రాలతో ఉత్తరాదిపై పట్టు సాధించే అవకాశముందనే వాదన వినిపిస్తున్నది. ఉత్తరాది మార్కెట్‌ను దక్షిణాది చిత్రాలు కొల్లగొట్టే రోజులు సమీపంలో ఉన్నాయనే ఆశాభావం సినీ ప్రముఖులు ఉన్నారు.

    English summary
    South Indian cinema tends to reward talent over looks in more films than Bollywood. South cinema is more daring, going into territories where Bollywood will not even think of going. Baahubali already proved that. In near future Robo 2.0, Baahubali The Conclusion, Randamoozham, Sanghamithra are going to rule the Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X