»   » నాట్ అవుట్: ‘బాహుబలి’ 50 రోజులు పూర్తి (పోస్టర్స్)

నాట్ అవుట్: ‘బాహుబలి’ 50 రోజులు పూర్తి (పోస్టర్స్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల బ్రద్దలు కొట్టే స్దాయిలో భాక్సాఫీస్ వద్ద ప్రబంజనంలా విజృంభించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 50 రోజుల పోస్టర్లను విడుదల చేసింది యూనిట్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మొదటి రోజు నుంచే అన్ని చోట్లా రికార్డ్స్ సృష్టించడం మొదలు పెట్టిన ఈ సినిమా మొదటి 50 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. లోకల్ మీడియానే కాక నేషనల్ మీడియా సైతం ఈ చిత్రంపై ప్రత్యేక కథనాలు ప్రచారం చేసింది. అంతర్జాతీయ మీడియా సైతం ఈ సినిమాపై దృష్టి పెట్టడం విశేషం.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.


50 రోజుల పోస్టర్స్ ఇక్కడ చూడండి.


ఓవరాల్ గానే కాకుండా....

ఈ చిత్రం ఏరియా ప్రకారం కూడా అన్నీ ఏరియాల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.


 


బ్రేక్ చేసింది

నైజాంలో బాహుబలి అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి మొదటి మూడు రోజుల్లోనే 35కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది.


నలభై కోట్లు

తాజా సమాచారం ప్రకారం మొదటి 48 రోజుల్లో బాహుబలి సినిమా ఒక్క నైజాంలోనే 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.


 


అత్తారింటిని దాటేసింది

ఇప్పటి వరకూ అత్యధికం అంటే ‘అత్తారింటికి దారేది' లాంగ్ రన్ లో 22 కోట్లు సాధించింది. ఇప్పుడేమో బాహుబలి ఆ సినిమాకి దాదాపుగా డబుల్ కలెక్ట్ చేసి ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డ్ ని సృష్టించింది.


సెకండాఫ్ కీలకం

ఈ సినిమా ఈ రేంజి సక్సెస్ అవటానికి కారణం సెకండాఫ్ లో యుద్ద సన్నివేశాలే అంటున్నారు విశ్లేషకులు


 


సత్తా

ఈ సినిమా తెలుగు వాడి సత్తా చూపిన చిత్రంగా అందరూ అభివర్ణిస్తున్నారు.


 


English summary
After shattering box office records, the mega-budget Baahubali celebrates another milestone, clocking 50 days in screens.
Please Wait while comments are loading...