twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ గురించి అంత పచ్చిగనా.. షారుక్‌ఖాన్‌కు సెన్సార్ షాక్

    షారుక్ తాజా చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రం సెన్సార్ వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంలోని మాటలు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

    By Rajababu
    |

    షారుక్ తాజా చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రం సెన్సార్ వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంలోని మాటలు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల రిలీజ్ చేసిన మిని ట్రైలర్ 2లోని శృంగారం (ఇంటర్‌కోర్స్) అనే పదంపై నిహ్లానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తుందా? చిత్రంలోని సీన్లపై కత్తెర వేస్తారా అనే ప్రశ్న రేకెత్తుతున్నది. దర్శకుడు ఇంతియాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో షారుక్ సరసన అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే.

    షారుక్ సినిమా ట్రైలర్‌పై సెన్సార్ కన్నెర్ర

    షారుక్ సినిమా ట్రైలర్‌పై సెన్సార్ కన్నెర్ర

    జూన్ 19వ తేదీన జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమాకు సంబంధించిన మినీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో షారుక్, అనుష్క శర్మ మాట్లాడుకునే సన్నివేశాలు చాలా బోల్డుగా ఉన్నాయి. వారిద్దరూ సెక్స్, అందుకు చెల్లించాల్సిన సొమ్ము, దానికి సంబంధించిన ఒప్పందాలపై బహిరంగంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. ఇంటర్‌కోర్స్ అని వాడిన పదంపై నిహ్లానీ అభ్యంతరం వ్యక్త చేయడం వివాదానికి దారితీసే పరిస్థితి కనిపిస్తున్నది.

    జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలో అశ్లీల డైలాగ్స్

    జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలో అశ్లీల డైలాగ్స్

    ట్రైలర్‌లో షారుక్, అనుష్క.. మన మధ్య ఏదైన లైంగిక సంబంధం ఉంటే.. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో శృంగారం జరిగితే.. దానికి లీగల్ ఛార్జీలు వర్తిస్తాయి అని మాట్లాడుకుంటారు. ఈ మాటలపై సెన్సార్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. వాటిని తొలగించాలని సూచించే అవకాశం కూడా కనిపిస్తున్నది.

    డైలాగ్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు సూచన

    డైలాగ్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు సూచన

    ట్రైలర్ పరంగా ఇంటర్నెట్‌లో ఓకే. లైంగిక సంబంధాల గురించి ఇంట్లో టెలివిజన్‌లో చూస్లే పిల్లల పరిస్థితి ఏంటి? న్యూస్ ఛానల్లో ప్రమోషన్ చేసేందుకు ట్రైలర్లను ప్రసారం చేస్తే కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అనే అభిప్రాయాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు వ్యక్తం చేశారు.

    ట్రైలర్‌ను టీవీల్లో, సినిమాల్లో ప్రదర్శించొద్దు

    ట్రైలర్‌ను టీవీల్లో, సినిమాల్లో ప్రదర్శించొద్దు

    సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లాని మాట్లాడుతూ.. మేము జబ్ హ్యారీ మెట్ సెజల్ ట్రైలర్‌కు యూఏ సర్టిఫికెట్ ఇచ్చాం. ఇంటర‌్‌కోర్సు డైలాగ్ తొలగించాలని సూచించాం. దీనిపై వాళ్లు ఏలాంటి సమాధానం చెప్పలేదు. అందుచేత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ట్రైలర్ ప్రదర్శించడానికి వీలులేదు అని చెప్పారు.

    English summary
    The latest entry in censor board chief Pahlaj Nihalani's bad books is Shah Rukh Khan and Anushka Sharma's upcoming film Jab Harry Met Sejal. The reason behind Nihalani's unhappiness is the word 'intercourse' in the Mini Trail 2 of the film. In the trailer, Anushka asks Shah Rukh to sign an indemnity bond which absolves him of all charges if they end up in a 'sexual relation'. Anushka says in the mini trail, "Agar humare beech koi sexual relation hota hai, amounting to or not amounting to full intercourse, you are absolved of all legal charges."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X