twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

    By Bojja Kumar
    |

    Recommended Video

    Small Screen Kamal Hassan Interview

    జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా తెలిపారు.

    మల్లెమాల సంస్థపై అభిమానం

    మల్లెమాల సంస్థపై అభిమానం

    నా ఇంటికి మల్లెమాల నిలయం అని పేరు పెట్టుకున్నా. ఆ సంస్థకు ఎప్పుడూ రుణపడి ఉండాలని తనకు ఎప్పుడూ అలా కనిపిస్తూ ఉండాలని అలా పెట్టుకున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చిన సంస్థ, మేము ఈ స్థాయికి రావడానికి కారణం ఆ సంస్థ....మల్లెమాల సంస్థను ఎప్పుడూ మరిచిపోను అని గెటప్ శ్రీను తెలిపారు.

    అన్నపూర్ణ స్టూడియోలో తినే ప్లేటు లాక్కుని గెంటేశారు

    అన్నపూర్ణ స్టూడియోలో తినే ప్లేటు లాక్కుని గెంటేశారు

    2007లో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ...... అక్కడ ఏదో షూటింగ్ ఓపెనింగ్ జరుగుతుండగా చూడటానికి వెళ్లాను. అక్కడ ప్రొడక్షన్లో తెలిసిన వ్యక్తి ఉంటే షూటింగ్ చూసేవు రమ్మంటే వెళ్లాను, ఆయన తినమంటే భోజనం చేస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఇంచార్జి వచ్చి ఎవడ్రా నువ్వు అని అడిగారు. తెలిసిన వారి ద్వారా లోనికి వచ్చాను అంటే... నన్ను బూతులు తిట్టారు. ప్లేటు లాగేసి కాలరు పట్టుకుని బయటకు గెంటేశారు.... అని గెటప్ శ్రీను తెలిపారు.

    వారం రోజులు ఏడ్చాను

    వారం రోజులు ఏడ్చాను

    అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆ సంఘటనో దాదాపు వారం రోజుల వరకు నాకు ఏడుపు ఆగలేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేవాడిని. చాలా అవమానం అనిపించింది. ఏదైనా పని చేసుకుని తినొచ్చుకదా... అక్కడే ఎందుకు తిన్నాను... ఇలా రకరకాలుగా ఆలోచనలు వచ్చేవి. అపుడే అనుకున్నా ఇదే స్టూడియోలో ఎప్పటికైనా నటించాలని. అనుకున్నది జరిగింది. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో ఇపుడు జబర్దస్త్ షూటింగ్ జరుగుతోంది. నేను కెరీర్లో ఎంత సక్సెస్ అయ్యాననే విషయం పక్కన పెడితే. ఒకప్పుడు నన్ను గెంటేసిన చోటే ఇపుడు నేను షూటింగులో చేస్తుండటం ఆనందంగా ఉంది అని.... గెటప్ శ్రీను తెలిపారు.

    పేద వ్యవసాయ కుటుంబం

    పేద వ్యవసాయ కుటుంబం

    మా అమ్మ నాన్నకు ఇండస్ట్రీ అంటే, సినిమా అంటే తెలియదు. వ్యవసాయ కుటుంబం. మా అన్నయ్యకు ఇండస్ట్రీ గురించి తెలుసు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఇంటర్ అయిపోయాక చదువు మధ్యలో మానేసి అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో ఏదైనా జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అదే సమయంలో సినిమా అవకాశాల కోసం తిరగొచ్చు అనే వచ్చేశాను.... అని గెటప్ శ్రీను తెలిపారు.

    నా జర్నీ ఖైదీ టు ఖైదీ నెం 151

    నా జర్నీ ఖైదీ టు ఖైదీ నెం 151

    చిన్నతనంలో ‘ఖైదీ' సినిమా చూసి యాక్టర్ అవ్వాలని ఇన్స్‌స్పైర్ అయ్యాను. 2004లో హైదరాబాద్ వచ్చాను. మొదట్లో అవకాశాల కోసం చాలా తిరిగాను. జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చింది, ఎంతో గుర్తింపు ఇచ్చింది. నాగ బాబు గారికి నేను రుణపడి ఉంటాను. నా స్కిట్లు చూపించి ఆయనే నాకు ఖైదీ నెం 151లో చిన్న అవకాశం ఇచ్చారు. ఖైదీ సినిమా చూసి ఇన్ స్పైర్ అయి చిరంజీవి లాగా ఇండస్ట్రీకి వెళదామని అనుకుని ఖైదీ నెం 151లో చేయడం నిజంగా అదృష్టం.... అని గెటప్ శ్రీను తెలిపారు.

    నాకు గాడ్ ఫాదర్ మ్యాగీ

    నాకు గాడ్ ఫాదర్ మ్యాగీ

    నాకు గాడ్ ఫాదర్ నా ఫ్రెండ్ మ్యాగీ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నాడు. వాడితో కలిసి నాగోల్‌లో ఉండేవాడిని. వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇద్దరం చాలాసార్లు తిండి కోసం కష్టపడిన సందర్భాలు ఉన్నాయిన అని.... గెటప్ శ్రీను తెలిపారు.

    ఇండస్ట్రీలో చాలా కష్టాలు

    ఇండస్ట్రీలో చాలా కష్టాలు

    చిన్నటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా కష్టం అనిపించలేదు. చిన్నతనంలో ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు..... అని గెటప్ శ్రీను తెలిపారు.

    తేజగారు అలా అనడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా

    తేజగారు అలా అనడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా

    నేను బాగా హర్టయిపోయి సూసైడ్ వరకు వెళ్లింది తేజ కేక సినిమా సమయంలో. ఆడిషన్ వెళ్లాను, సెలక్టయ్యాను. తేజగారు రెండోసారి నన్ను టెస్ట్ చేస్తుంటే....ఏదో ఆలోచిస్తున్నావన్నారు. లేదు సార్ చేయడం లేదు అన్నాను. నువ్వు ఇపుడే ఇలా సమాధానం చెబెతున్నావ్ రేపు సినిమాలో కష్టం అని రిజక్ట్ చేశారు. వెళ్లిపో అన్నారు. ట్యాంక్ బండ్ వెళ్లిపోయి బుద్దున్ని చూస్తూ అలా ఉండిపోయాను. దూకేద్దామా? చచ్చిపోదామా? ఏం చేద్దాం అలా ఉండిపోయాను. చివరకు ఆలోచన విరమించుకున్నాను అని గెటప్ శ్రీను తెలిపారు.

    చచ్చేంత కష్టపడాలి కానీ చచ్చిపోవద్దు అని డిసైడ్ అయ్యాను

    చచ్చేంత కష్టపడాలి కానీ చచ్చిపోవద్దు అని డిసైడ్ అయ్యాను

    ఆ సమయంలో మళ్లీ నాలో ఉన్న పాజిటివ్ ఆలోచన..... ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని ఆలోచించాను. చచ్చిపోతే అమ్మా నాన్న ఏమైపోవాలి, సినిమా కోసం చచ్చిపోవాలా? చచ్చేంత కష్టపడాలి కానీ చచ్చిపోవద్దు అనుకున్నాను. ఈ విషయం మా గ్రూపు వాళ్లు చెప్పడంతో నీకేమైనా పిచ్చేంట్రా అని తిట్టారు.... అని గెటప్ శ్రీను తెలిపారు.

    ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్

    ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్

    సుదీర్ నాకు బ్యాచిలర్ హుడ్ ఫ్రెండ్. ఇద్దరం రూమ్మేట్స్. రాంప్రసాద్ కూడా అపుడే పరిచయం. ఇద్దరూ అంటే నాకు చాలా ఇష్టం. నా పెళ్లి సుధీర్ చేశాడు. వాడికి తెలిసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను.... అని గెటప్ శ్రీను తెలిపారు.

    సుధీర్ పెళ్లి చేయాలి

    సుధీర్ పెళ్లి చేయాలి

    సుధీర్ పెళ్లి చేయాలి. వాడికి సెట్టయ్యే అమ్మాయి దొరకాలని చూస్తున్నాం. ఇంట్లో కూడా ట్రై చేస్తున్నారు. నేను చాలా ట్రై చేశాను. ఆరేడు సంబంధాలు చూశాను. కానీ సెట్టవ్వట్లేదు. వాడేమో మా అమ్మా నాన్నకి నచ్చితే చాలు అంటాడు. వాళ్ల అమ్మా నాన్నలేమో కొన్ని ఫారన్ సంబంధాలు కావడం, మరికొన్ని జాతకాలు కలవక పోవడం వల్ల.... సెట్టవ్వట్లేదు అని గెటప్ శ్రీను తెలిపారు.

    జబర్దస్త్ బూతు షో అనే విమర్శలపై

    జబర్దస్త్ బూతు షో అనే విమర్శలపై

    జబర్దస్త్ బూతు షో అనే విమర్శలపై గెటప్ శ్రీను స్పందిస్తూ..... బూతు అనేది ఎప్పటి నుండో ఉంది. కానీ బూతు అనే పదం ఈ షోలోనే చూశాం, ఇక్కడే నేర్చుకున్నాం అనే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. బూతు ఎక్కడ ఉంది. 200 శాతం నా షోలను నేను సపోర్టు చేసుకుంటాను. బూతు ఉందన్నోడు ప్రతివోడు బూతే. అంతకు ముందు బాగా తెలిసినోడే, చూసినోడే. ఎవడైతే అన్నాడో వారి హిస్టరీ చూద్దాం. వారి హిస్టరీలో బ్రౌజింగులో ఎటువంటివి లేకుండా ఉంటే నిజంగా దేవుడు అని దండం పెడతాను. చేసేవన్నీ చేస్తారు. షో మీద ఏడుస్తారు..... అంటూ గెటప్ శ్రీను ఫైర్ అయ్యారు.

    నచ్చని వారు చూడొద్దు

    నచ్చని వారు చూడొద్దు

    ఓ మహానుభావుడు షకీలా షో చూస్తే అంత కంటే ఎక్కువ వ్యూస్ ఉంటాయి అని చెప్పాడు. ఆయన అవే చూస్తుంటాడేమో అందుకే అంత బాగా వర్ణించాడు. జబర్దస్త్ కు ఆదరణ లేకుంటే ఇంత రేటింగ్ వస్తుందా? ఇన్నేళ్లు ఇంత సక్సెస్ ఫుల్ గా నడుస్తుందా? ఒక వేళ ఇది బాగోలేదు, ఇష్టం లేదు అన్నపుడు మంచి ఆప్షన్ ఉంది. మీ చేతిలో రిమోట్ ఉంది. వెంటనే పక్క ఛానల్ కు వెళ్లండి.... అంటూ గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.

    సుధీర్, రష్మి మధ్య ఏమీ లేదు

    సుధీర్, రష్మి మధ్య ఏమీ లేదు

    రష్మి, సుధీర్ మధ్య ఏమీ లేదు. నాకు ప్రియాంకకు లింకు పెట్టారు.... ఇవన్నీ మీడియా వారు చేసే ప్రచారం మాత్రమే అని శ్రీను కొట్టిపారేశారు.

    ప్రదీప్ విషయంలో హర్టయ్యాను.

    ప్రదీప్ విషయంలో హర్టయ్యాను.

    ప్రదీప్ విషయంలో మీడియాలో వార్తలు చూసి చాలా హర్టయ్యాను. ఆ రోజు ఆయన తాగి ఉండొచ్చు. తాగడం తప్పు కాదు. తాగి డ్రైవ్ చేయడం తప్పే అని ప్రదీప్ గారే అన్నారు. తాగి డ్రైవ్ చేయకూడదు అని వీడియో పెట్టాను. ఈ తప్పు పునరావృతం కాదు అని చెప్పాడు. చెప్పినపుడు కూడా విచిత్రమైన క్వశ్చన్స్ మీడియా వారు వేశారు. వారి ఫ్యామిలీ, అమ్మ గురించి చాలా రకాలుగా రాసి తనను కృంగదీశారు... అని గెటప్ శ్రీను తెలిపారు.

    English summary
    It’s hard to digest if someone tells they know jabardasth but they dont know Getup Srinu, Famous for doing various getups for every skit, He is an unerasable star in telugu tv comedy recently. Getup srinu also termed as “Bulli thera kamal hasan” i.e “shortscreen kamal hasan” is famous among youth and highly reknown personality in extra jabardasth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X