»   » ‘జాదూగాడు’ ఆడియో ఆవిష్కరణ(ఫోటోస్)

‘జాదూగాడు’ ఆడియో ఆవిష్కరణ(ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘జాదూగాడు'. యోగేష్‌ దర్శకత్వంలో వి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘నన్ను హీరోగా అనుకోవడమే కాకుండా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా ఫస్ట్‌ టైమ్‌ లవ్‌ ఇమేజ్‌ నుంచి మారి మాస్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. మా డైరెక్టర్‌గారి కసి, మా మధుగారి కథ, శ్రీరామ్‌గారి విజువల్స్‌, సాగర్‌గారి మ్యూజిక్‌, అందమైన కోస్టార్‌.. వీళ్ళంతా కలవడం వల్ల ఒక మంచి మూవీ రెడీ అయింది. నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్‌గారికి, డైరెక్టర్‌ యోగిగారికి మనస్ఫూర్తిగా థాంక్స్‌ చెప్తున్నాను'' అన్నారు.

సాగర్‌ మహతి మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారకులు మా తాతగారు, నాన్నగారు. ఎన్ని జన్మలకైనా ఆ రుణం తీర్చుకోలేనిది. నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంత మంచి మ్యూజిక్‌ లైఫ్‌ని ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగశౌర్య ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. యోగేష్‌ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్'' అన్నారు.

స్లైడ్ షో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోస్

సీడీ ఆవిష్కరణ


ఆడియో వేడుకకు మణిశర్మ ముఖ్య అతిథిగా హాజరై బిగ్ సీడీని ఆవిష్కరించారు.

నాగ శౌర్య, సోనారిక


నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘జాదూగాడు'.

నటీనటులు


నాగశౌర్య, సోనారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథ్‌, మాధవి, అజయ్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, జాకీర్‌ హుస్సేన్‌, ఆశిష్‌ విద్యార్థి, రవి కాలే, ప్రభాస్‌ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనక


ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, విశ్వ, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: సాగర్‌ మహతి, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, నిర్మాత: వి.వి.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేష్‌.

English summary
Telugu Movie Jadoogadu Audio Launch event held held at Hyderabad.
Please Wait while comments are loading...